మహావతార్ నరసింహ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉగ్ర నరసింహావతారం చూపిస్తోంది. ఒకపక్క బ్రేక్ ఈవెన్లు కాక బడా ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటే ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఎవరూ ఊహించలేదు. నిన్నటితో రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగులు పెట్టిన ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ గా ట్రిపుల్ సెంచరీని పెట్టుకుంది. అయితే టచ్ కావడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గురువారం ఒకే రోజు వార్ 2, కూలీ రెండూ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి థియేటర్లు సర్దడమే ఎగ్జిబిటర్లకు మహా కష్టంగా ఉంది. అలాంటిది పాత సినిమాలు కొనసాగించే సీన్ లేదు.
మెయిన్ సెంటర్స్ మినహాయించి తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న బిసి కేంద్రాల్లో మహావతార్ నరసింహకు సెలవు ఇవ్వక తప్పదు. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయని, మూడో వారం వీకెండ్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి మాములుగా పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు చూస్తామని, కానీ మహావతార్ నరసింహ వాటికి ధీటుగా నిలుస్తోందని ట్రేడ్ టాక్. ఇప్పటికీ చూడకుండా మిస్సయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ కావాలని వారాంతం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. హైక్ లేకుండా సాధారణ ధరలకే అమ్మడం నిర్మాతలకు సానుకూలంగా మారింది.
లెక్కల సంగతి పక్కనపెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కు ఒక లెసన్ లాంటిది. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తి మీద పెట్టుకుని చూస్తారనడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా మూడు వందల కోట్లు దాటేసేది కానీ రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దీనికొచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు సైతం యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారట. అతి దగ్గరలో ఇదో ట్రెండ్ గా మారిపోవడం మాత్రం ఖాయం.
This post was last modified on August 11, 2025 3:58 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…