ఆగస్ట్ 27 మాస్ జాతర విడుదల కానుంది. స్టార్ రైటర్ భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ కాగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. పలు వాయిదాల తర్వాత కొత్త రిలీజ్ డేట్ కూడా అనుమానంగానే ఉన్న నేపథ్యంలో వాటికి చెక్ పెడుతూ టీజర్ రూపంలో దాన్ని ధృవీకరించారు. రైల్వేలో పని చేసే ఒక పోలీస్ ఆఫీసర్, ఏదైనా అన్యాయం జరిగితే తుక్కు రేపే మనస్తత్వం, ట్రైన్ లో అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడటం ఇలా ఫక్తు కమర్షియల్ స్కేల్ లో కొలతలు రాసుకుని తీసినట్టు ఉంది.
టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, రావణాసుర లాంటి ప్రయోగాలు విఫలమవ్వడంతో రవితేజ తిరిగి తన పాత స్కూల్ కు వచ్చినట్టు ఉంది. అయితే రొటీన్ ట్రీట్ మెంట్లు ఇప్పుడు అట్టే వర్కౌట్ కావడం లేదు. రెగ్యులర్ గా అనిపిస్తే చాలు జనం నో అనేస్తున్నారు. మరి మాస్ జాతరలో ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయేమో రిలీజ్ అయ్యేదాకా చెప్పలేం. విజువల్స్, యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఫైట్స్, డైలాగులు అన్నీ రవితేజ ముద్రలోనే ఉన్నాయి. చిన్న టీజర్ కాబట్టి కథ గురించి ఎక్కువ క్లూస్ ఇవ్వలేదు కానీ కంటెంట్ అయితే పూర్తిగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
మాస్ జాతర హిట్టు కావడం రవితేజకు చాలా అవసరం. ధమాకా తర్వాత సోలో హీరోగా తనకు సక్సెస్ లేదు. వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా కాబట్టి పూర్తి క్రెడిట్ దక్కలేదు. వేగం విషయంలో రవితేజ అందరికన్నా ముందు ఉన్నప్పటికీ ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. మాస్ జాతర మాత్రం తాను బాగా ఇష్టపడి చేసిన సబ్జెక్టని ఇన్ సైడ్ టాక్. విక్రమార్కుడు, కిక్ ని కలిపితే ఎలా ఉంటుందో అంతకు రెట్టింపు వినోదం ఉంటుందని టీమ్ మెంబర్స్ అంటున్నారు. ఆగస్ట్ చివరి వారంలో పెద్దగా పోటీ లేదు. పాజిటివ్ టాక్ వస్తే రెండు మూడు వారాలు మంచి రన్ దొరుకుతుంది. అది తెచ్చుకోవడమే కీలకం.
This post was last modified on August 11, 2025 1:11 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…