నిన్న 50వ పడిలో అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలతో మొదలుపెట్టి అతడు రీ రిలీజ్ థియేటర్లలో అభిమానుల దాకా అందరూ ఘనంగా జరుపుకున్నారు. అయితే అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కి ఇది ఎందుకు అసలైన మలుపు కానుందో చూద్దాం. పాతికేళ్ల నట ప్రస్థానంలో మహేష్ సోలో హీరోగా చేసినవి 28 సినిమాలే. వాటిలో ఒక్క రీమేక్ లేదు. పక్క భాషల నుంచి కథలు అద్దెకు తెచ్చుకుని సేఫ్ గేమ్ ఆడలేదు. హిందీ మార్కెట్ కోసం పాకులాడలేదు. ఆ మాటకొస్తే తనను కలిసిన ఎందరో బాలీవుడ్ మేకర్స్ కి సున్నితంగా నో చెప్పుకుంటూ వచ్చి ఓన్లీ తెలుగుతో గెలుస్తూ వచ్చాడు.
ఇప్పుడు కోరుకున్న ఘడియ రానే వచ్చింది. ప్రపంచంలోని టాప్ క్లాస్ ఫిలిం మేకర్స్ సైతం ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 చేతికి దక్కింది. రాజమౌళి తన మరో కలల ప్రాజెక్టుకు మహేష్ బాబునే ఎంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో కేవలం పాటకు మాత్రమే ఆస్కార్ తెచ్చుకున్న జక్కన్న ఈసారి దర్శకత్వ అవార్డు వైపు గురి పెడుతున్నాడు. కేవలం ప్రీ లుక్ తోనే ప్రకంపనలు రేపుతున్నాడు. భారతీయ మూలాలు మర్చిపోకుండా తీసుకున్నది ఇండియానా జోన్స్ స్ఫూర్తినే అయినా మన నేటివిటీతో మన అడవి కథను గర్వంగా చూపించబోతున్నాడు. ఇప్పటిదాకా నార్త్ ని సీరియస్ గా తీసుకోని మహేష్ కు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ గుర్తింపు రానుంది.
నవంబర్ లో టీజర్ వస్తుందని రాజమౌళి సూచన ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దర్శనం కోసం ఇంకో మూడు నెలలు ఎదురు చూడాల్సిందే. బాలనటుడిగా బుడిబుడి అడుగులు వేస్తూ, నాన్న కృష్ణతో కలిసి తెరను పంచుకుంటూ, అన్నయ్య రమేష్ విఫలమైన చోట తాను గెలవాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని మైలురాళ్ళు దాటి గెలవడం ఫ్యాన్స్ నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు. అభాగ్యులైన చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ మహేష్ సాగిస్తున్న ప్రస్థానం వంద సినిమాలను చేరుకుంటుందో లేదో కానీ వందేళ్ల పాటు గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ మూవీస్ అందించే హామీ ఇస్తోంది.
This post was last modified on August 10, 2025 10:26 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…