‘‘ఎంత మంచి టాక్ వచ్చినా.. వీకెండ్ తర్వాత కష్టమే’’.. ‘‘వీక్ డేస్‌లో సినిమాకు మంచి వసూళ్లు రావండీ’’.. ‘‘రెండో వారంలో ఇంకో కొత్త సినిమా వస్తే.. ముందు వారంలో వచ్చిన సినిమాను ప్రేక్షకులు పట్టించుకోరు’’.. ‘‘ఈ రోజుల్లో కొన్ని వారాల పాటు సినిమా ఎక్కడ ఆడుతుందండీ’’.. ‘‘ప్రేక్షకులకు వెండితెర మీద ఆసక్తి పోయింది. ఓటీటీలను దాటి వాళ్లను థియేటర్లకు తీసుకురావడం కష్టం’’.. ‘‘పబ్లిసిటీ లేకుండా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లడం సాధ్యం కాదు’’.. ఇలా ఎన్నో అభిప్రాయాలు బలపడిపోయాయి గత కొన్నేళ్లలో. ఎంత మంచి సినిమా తీసినా.. స్టార్లు ఉన్నా జనాలను థియేటర్లకు రప్పించడం కష్టమని ఫిక్సయిపోతున్నారు నిర్మాతలు.
కానీ సిన్సియర్‌గా సినిమా తీసి, టికెట్ల ధరలను అందుబాటులో పెడితే జనం ఎలా థియేటర్లకు విరగబడి వస్తారో ‘మహావతార నరసింహా’ అనే సినిమా రుజువు చేస్తోంది. రెండు వారాల కిందట ఏమాత్రం అంచనాల్లేకుండా రిలీజైన ఈ యానిమేషన్ మూవీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ రోజు బుక్ మై షోలో గంటకు 35-40 వేల మధ్య టికెట్లు తెగుతున్నాయి ఈ చిత్రానికి. మల్టీప్లెక్సుల్లో ఫుల్స్ పడుతున్నాయి. వాటిలో ఈవెనింగ్ షోలకు ఎక్కడా టికెట్లు దొరికే పరిస్థితి లేేదు.
ముందే అన్నీ బుక్ అయిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇలా మూడో వీకెండ్లో ఈ స్థాయిలో జనాలతో థియేటర్లు కళకళలాడిన సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి లేదు. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా, బజ్ లేకుండా రిలీజైన సినిమా.. ఈ స్థాయిలో జనాలను మెప్పించడం అరుదైన విషయం. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక వారానికే కళ్ళు తేలేస్తున్న రోజుల్లో నటులు లేని ఒక యానిమేషన్ మూవీ ఇలా వారాల తరబడి ఆడడం షాకింగ్. ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి సినిమా చూడాలి అనిపించే కంటెంట్ ఉండడం.. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం ఈ సినిమా అసాధారణ విజయానికి కారణం. దీన్ని బట్టి సినిమా సక్సెస్‌కు ఏం అవసరం అన్నది ఫిలిం మేకర్స్ ఆలోచిస్తే మంచిది.
This post was last modified on August 9, 2025 4:46 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…