నిన్న సాయంత్రం స్పెషల్ ప్రీమియర్లతో అతడు రీ రిలీజైపోయింది. ఓపెనింగ్స్ పరంగా ఖలేజా రికార్డులను బద్దలు కొడుతుందని ఆశించిన అభిమానులకు ఈసారి టైమింగ్ మిస్సయినట్టు కనిపిస్తోంది. ముందస్తు అంచనాల ప్రకారం ఇవాళ్టితో కలుపుకుని సుమారు అయిదు కోట్ల దాకా గ్రాస్ రావొచ్చని ఒక అంచనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆశించిన స్థాయిలో పెద్ద ఎత్తున బుకింగ్స్ లేవని ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రెండున్నర కోట్ల దాకా వసూలయ్యాయట. ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పరీక్ష పెడుతున్నాయి. జనం బయటికి రావడానికి జంకుతున్నారు.
మూడో వారంలోనూ మహావతార్ నరసింహ ర్యాంపేజ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. వీకెండ్ మొత్తం ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో డిస్ట్రిబ్యూటర్లు షోలు పెంచుతున్నారు. వీటికి తోడు కింగ్డమ్ రెండో వారం థియేటర్ అగ్రిమెంట్లు కొనసాగుతుండగా వార్ 2, కూలీ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ వాటికి కావాల్సిన సొమ్ముల కోసం ఇప్పుడు సినిమాలకు వెళ్లడం తగ్గించుకున్నారు. ఇది కూడా అతడు మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ గా ఎప్పటికి మర్చిపోలేని మైలురాళ్ళు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి పైన చెప్పినవి అడ్డంకిగా మారుతున్నాయి.
సుదర్శన్ 35 ఎంఎంలో రెండు రోజులకు నాలుగు షోలు వేయించుకోవడానికే నానా తంటాలు పడిన వైనం కనిపించింది. అతడుకి చేతిలో ఉన్నవి అయిదు రోజులు మాత్రమే. నిజానికి అతడు చాలా స్పెషల్ గా సెలెబ్రేట్ చేయాల్సిన మూవీ. మహేష్ స్వాగ్, త్రివిక్రమ్ దర్శకత్వం, మణిశర్మ అద్భుతమైన పాటలు, ట్విస్టులు, టెక్నికల్ స్టాండర్డ్స్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మురారికే ఓ రేంజ్ సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ అతడుకి అంతకు పదింతలు హంగామా చేయాలని చూశారు. కానీ అనుకోని అవాంతరాలు బ్రేక్ వేస్తున్నాయి. అయినా సరే పెద్ద నెంబర్లు వచ్చాయంటే అది మహేష్ బాబు ఘనతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates