Movie News

నరసింహా… ఇదేం ఊచకోతయ్యా

మహావతార నరసింహ.. కన్నడేతర భాషల్లో ఈ పేరుతో ఓ సినిమా రిలీజవుతున్నట్లు కూడా జనాలకు తెలియదు. కానీ రిలీజ్ రోజు చూసిన కొద్దిమంది ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమా అద్భుతం అంటూ కొనియాడడంతో తర్వాతి రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం, పిల్లలకు తప్పక చూపించాల్సిన అనే టాక్ రావడంతో ఫ్యామిలీస్ థియేటర్లకు వరుస కట్టాయి. దీంతో ప్రేక్షకుల డిమాండ్‌కు తగ్గట్లు స్క్రీన్లు, షోలు పెంచుతూ పోయారు డిస్ట్రిబ్యూటర్లు. రిలీజైన రెండు వారాలకు కూడా సినిమా జోరు తగ్గలేదు.

ఈ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది. చిన్న చిన్న టౌన్లలో కూడా కొంచెం లేటుగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి ఈవెనింగ్ షోలకు ఫుల్స్ పడిపోతుండడం విశేషం. కన్నడతో పాటు తెలుగు, హిందీలో ఈ చిత్రం అదరగొడుతోంది. ఇండియాలో రిలీజైన యానిమేషన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది.

తొలి వారంలోనే దాదాపు రూ.60 కోట్ల వసూళ్లతో ఆల్ టైం యానిమేషన్ గ్రాసర్‌గా రికార్డు నెలకొల్పింది ‘మహావతార నరసింహ’. రెండో వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఒక యానిమేషన్ సినిమా, అది కూడా అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన మూవీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అసామాన్యం.

వచ్చే వారం ‘కూలీ’, ‘వార్-2’ వచ్చే వరకు ఈ సినిమాకు ఎదురే లేదనిపిస్తోంది. ఆ చిత్రాలు వచ్చాక కూడా కొన్ని షోలతో సినిమాను కొనసాగించడం ఖాయం. ఫుల్ రన్లో రూ.150 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఏ యానిమేటెడ్ మూవీ అందుకోలేని రికార్డులను ఈ సినిమా నెలకొల్పుతోంది. మళ్లీ హోంబలే వాళ్లు ఇదే జానర్లో తీయబోతున్న సినిమాలే ఈ రికార్డులను దాటుతాయేమో.

This post was last modified on August 9, 2025 6:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago