మహావతార నరసింహ.. కన్నడేతర భాషల్లో ఈ పేరుతో ఓ సినిమా రిలీజవుతున్నట్లు కూడా జనాలకు తెలియదు. కానీ రిలీజ్ రోజు చూసిన కొద్దిమంది ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమా అద్భుతం అంటూ కొనియాడడంతో తర్వాతి రోజు నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం, పిల్లలకు తప్పక చూపించాల్సిన అనే టాక్ రావడంతో ఫ్యామిలీస్ థియేటర్లకు వరుస కట్టాయి. దీంతో ప్రేక్షకుల డిమాండ్‌కు తగ్గట్లు స్క్రీన్లు, షోలు పెంచుతూ పోయారు డిస్ట్రిబ్యూటర్లు. రిలీజైన రెండు వారాలకు కూడా సినిమా జోరు తగ్గలేదు.
ఈ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది. చిన్న చిన్న టౌన్లలో కూడా కొంచెం లేటుగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఈ చిత్రానికి ఈవెనింగ్ షోలకు ఫుల్స్ పడిపోతుండడం విశేషం. కన్నడతో పాటు తెలుగు, హిందీలో ఈ చిత్రం అదరగొడుతోంది. ఇండియాలో రిలీజైన యానిమేషన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది.
తొలి వారంలోనే దాదాపు రూ.60 కోట్ల వసూళ్లతో ఆల్ టైం యానిమేషన్ గ్రాసర్‌గా రికార్డు నెలకొల్పింది ‘మహావతార నరసింహ’. రెండో వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఒక యానిమేషన్ సినిమా, అది కూడా అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన మూవీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అసామాన్యం.
వచ్చే వారం ‘కూలీ’, ‘వార్-2’ వచ్చే వరకు ఈ సినిమాకు ఎదురే లేదనిపిస్తోంది. ఆ చిత్రాలు వచ్చాక కూడా కొన్ని షోలతో సినిమాను కొనసాగించడం ఖాయం. ఫుల్ రన్లో రూ.150 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఏ యానిమేటెడ్ మూవీ అందుకోలేని రికార్డులను ఈ సినిమా నెలకొల్పుతోంది. మళ్లీ హోంబలే వాళ్లు ఇదే జానర్లో తీయబోతున్న సినిమాలే ఈ రికార్డులను దాటుతాయేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates