భారీ సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు తీసిన, తీస్తున్న నిర్మాత అనిల్ సుంకర ఇప్పడు సైలంట్ గా ఓ ఓటిటి సినిమా కూడా తీసేస్తున్నారు. అంతే కాదు, అలాంటి సినిమాలు మరిన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఓటిటి సినిమాలో కమెడియన్ సునీల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏనాడో సినిమాలు చేసి, గ్యాప్ తీసుకున్న దర్శకుడు విఎన్ ఆదిత్యకు ఈ సినిమాను అప్పగించడం విశేషం.
ఈ సినిమా గురించి బయట ఎక్కడా ఓ నోట్ లేదు, హడావుడి లేదు షూటింగ్ మాత్రం సగం వరకు ఫినిష్ చేసేసారు. ఇలాగే మరి కొన్ని సబ్జెక్ట్ లు కూడా డిస్కషన్ లో వున్నాయని, వాటిని కూడా తెరకెక్కించే ఆలోచనలో అనిల్ సుంకర వున్నారని వార్తలు అందుతున్నాయి.
ఇదిలా వుంటే ఇలా ఓటిటి సినిమాలు చేస్తూనే అజయ్ భూపతితో మహా సముద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా ఒకటి ఖాతాలో వుంది. ఇవన్నీ బాగానే వున్నాయి కానీ, ఎప్పడో అల్లరి నరేష్ తో నిర్మించిన బంగారుబుల్లోడు సంగతేమిటో?
This post was last modified on November 19, 2020 10:37 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు…
పెద్ద హీరోల సినిమాలకు ఏ టైటిల్ పెట్టినా చెల్లుతుందనుకోవడం తప్పు. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు చేసినా దాని ప్రభావం…
``జగన్ గురించి ఎందుకు అంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారో.. నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆయన చాలా మంచి వారు.…
జనసేన నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూ…
ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…