ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ అవుతున్న అతడుదే డామినేషన్ అయ్యేలా ఉంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రమ్ సో’ని మైత్రి తీసుకొస్తున్నా జనాలకు రీచ్ అవుతున్న దాఖలాలు పెద్దగా లేవు. మౌత్ టాక్ కనక వేగంగా స్ప్రెడ్ అయితే మంచి వసూళ్లు కళ్లజూడవచ్చు. మంజుమ్మల్ బాయ్స్ తరహాలో తమకు సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకం మైత్రి టీమ్ లో ఉంది. నిన్న రాజ్ బి శెట్టితో పాటు టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈవెంట్ చేయడం సోషల్ మీడియాలో కొంత బజ్ తీసుకొచ్చింది. ఇక అతడు విషయానికి వస్తే రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ లో రెండు కోట్ల దాకా గ్రాస్ వచ్చేసింది.
ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున అతడుతో సెలెబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి పలు బ్రేకులు పడుతున్నాయి. మొదటిది కింగ్డమ్ ఫలితంతో సంబంధం లేకుండా వార్ 2 వచ్చే దాకా కొనసాగేలా మెయిన్ థియేటర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. ఇంకోవైపు మహావీర్ నరసింహ తగ్గేదేలే తరహాలో బుక్ మై షోలో రోజుకు కనీసం లక్షన్నర టికెట్లు అమ్ముతోంది. అతడు కోసం దీన్ని తీసేంత సీన్ ఎంత మాత్రం లేదు. వచ్చే వారం కూలి, వార్ 2 కేవలం అయిదు రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. సో అతడు ఎంత రాబట్టుకున్న ఈ లోపే పూర్తి చేయాలి. అందుకే రికార్డులు అనుమానంగానే ఉన్నాయి.
ట్రేడ్ టాక్ ప్రకారం అతడు రీ రిలీజ్ హక్కులు మూడున్నర కోట్లకు తీసుకున్నారట. అది కూడా కేవలం ఎడాది కాలానికి మాత్రమే. ఇది రికవర్ కావాలంటే పది కోట్ల గ్రాస్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం టఫ్ గానే ఉంది. ఖలేజా, మురారి లాగా ఫ్రీ గ్రౌండ్ దొరికితే ఖచ్చితంగా అతడు సునామినే అయ్యేది. అడ్డంకులు ఎన్ని ఉన్నా అతడు పై చేయి సాధించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. మహేష్ కోటగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎంలో కేవలం రెండు షోలు మాత్రమే దొరకడం లాంటి అసంతృప్తులు వాళ్ళను వెంటాడుతున్నాయి. చూడాలి అతడు ఎలాంటి మైలురాళ్లు సృష్టించబోతున్నాడో.
This post was last modified on August 7, 2025 10:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…