2000 తర్వాత అటు తమిళంలో, ఇటు తెలుగులో ఎన్నో మిడ్ రేంజ్ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ సంగీత. ‘ఖడ్గం’ సహా అనేక తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించిన ఆమె.. లీడ్ రోల్స్ తగ్గాక క్యారెక్టర్ రోల్స్‌లోకి మారింది. ఇప్పుడు కూడా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల నైంటీస్ రీ యూనియన్ ఈవెంట్లో కూడా మెరిసన సంగీత.. ఇప్పుడు ఓ నెగెటివ్ న్యూస్‌తో వార్తల్లోకి వచ్చింది. ఆ న్యూస్ సంగీత వ్యక్తిగత జీవితానికి సంబంధించింది.
సంగీత తన భర్త క్రిష్ నుంచి విడిపోతున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుక్కారణం.. సోషల్ మీడియాలో తన పేరు వెనుక ‘క్రిష్’ అన్న పేరును తొలగించేయడమేనట. సంగీత క్రిష్ కాస్తా ఉత్త సంగీతగా మారిపోయిందని.. ఇది ఆమె విడాకులు తీసుకుంటోందనడానికి సంకేతమని నెటిజన్లు చర్చించుకోవడం మొదులపెట్టారు. మీడియాలోనూ ఈ మేరకు వార్తలు మొదలయ్యాయి. ఐతే ఈ రూమర్లకు సంగీత వెంటనే చెక్ పెట్టేసింది.
తాను మొదట్నుంచి సోషల్ మీడియాలో తన పేరును సంగీతగానే పెట్టుకుంటున్నాని.. ఇప్పుడు కొత్తగా మార్పేమీ లేదని ఆమె స్పష్టం చేసింది. తన భర్తతో తాను చాలా సంతోషంగా ఉన్నానని.. తమ మధ్య ఏ ఇబ్బందీ లేదని.. తాము విడాకులు తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని ఆమె స్పష్టం చేసింది. క్రిష్ తమిళంలో పేరున్న గాయకుడు. అతణ్ని సంగీత 16 ఏళ్ల కిందట పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగీత త్వరలోనే ‘పరదా’ అనే బహు భాషా చిత్రంలో ప్రేక్షకులకు ముందుకు రానుంది.
This post was last modified on August 7, 2025 6:39 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…