కేవలం 15 ఏళ్లకే కథానాయికగా అరంగేట్రం చేసి.. టీనేజీలోనే పెద్ద స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది తమన్నా. రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఇటు దక్షిణాదిన.. అటు బాలీవుడ్లో ఆమె భారీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. గత కొన్నేళ్లలో కథానాయికగా అవకాశాలు తగ్గినప్పటికీ.. ఐటెం సాంగ్స్‌లో మెరుస్తూ, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమ్మూ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి పంచుకుంది. ఒక సౌత్ బిగ్ స్టార్ తన మీద సెట్స్‌లో అందరి ముందు కేకలు వేశారని.. ఆ తర్వాత తనకు సారీ చెప్పారని ఆమె వెల్లడించంది.
ఆ స్టార్ ఎవరన్నది చెప్పలేదు కానీ.. ఆ హీరో టాలీవుడ్‌కు చెందిన వాడే అయ్యుంటాడనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ అనుభవం గురించి తమన్నా ఏం చెప్పిందంటే?
‘‘నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేశాను. దీంతో నాకు పెద్దగా ఏమీ తెలియదని అనుకునేవాళ్లు. నా కాన్ఫిడెన్స్‌ను దెబ్బ తీయాలని చూసేవారు. నన్ను అవమానించడానికి ప్రయత్నించారు. ఐతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలానికే నాకు ఓ పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం దక్కింది. కానీ ఆయనతో కొన్ని సీన్లు చేసేటపుడు ఇబ్బందిగా అనిపించేది. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్పాను. ఆ సీన్లు నా వల్ల కాదన్నాను.
అప్పుడు ఆ హీరో హీరోయిన్ని మార్చమంటూ నాపై కేకలు వేశాడు. సెట్లో అందరి ముందూ ఆయన అరిచాడు. ఐతే ఒకరు మన పట్ల అవమానకరంగా ప్రవర్తించినా.. తిరిగి మనం అలా చేయకూడదని సైలెంట్‌గా ఉన్నా. ఐతే తర్వాతి రోజు ఆ హీరో తనంతటే తనే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. కోపంలో అరిచానని.. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దీంతో ఆ గొడవ సమసిపోయింది’’ అని తమన్నా వివరించింది. హిందీలో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ అనే చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన తమన్నా.. తెలుగులోకి మంచు మనోజ్ మూవీ ‘శ్రీ’తో ఎంట్రీ ఇచ్చింది. ‘హ్యాపీడేస్’తో పెద్ద బ్రేక్ వచ్చాక చూస్తుండగానే పెద్ద హీరోయిన్ అయిపోయింది తమ్మూ.
This post was last modified on August 7, 2025 6:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…