టాలీవుడ్ ఒకప్పుడు గబ్బర్ సింగ్, బలుపు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లతో మంచి స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన శృతి హాసన్ కాటమ రాయుడు తర్వాత కనిపించకుండా పోయింది. మళ్ళీ సలార్ లో దర్శనమిచ్చింది. అందులో ప్రభాస్ సరసన ఆడి పాడకపోయినా కాస్త చెప్పుకోదగ్గ పాత్రే దక్కింది. తాజాగా కూలీలో ఫుల్ లెన్త్ రోల్ చేసింది. అయితే ఇందులో తను హీరోయిన్ కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈమెకు పెట్టలేదు. అయితే చెన్నై వర్గాల కథనం ప్రకారం కూలీలోని కీలకమైన ట్విస్టులన్నీ ఈమె చుట్టే ఉంటాయట. ఒకవేళ నిజమైతే కనక ఫ్యాన్స్ కి పండగే. అవేంటో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.
శృతి హాసన్ తండ్రైన సత్యరాజ్ హార్బర్ లో జరిగే మాఫియా రహస్యాలను వెతికి తీసే పనిలో ఉంటాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ తో ఏర్పడిన స్నేహం బంధంగా మారుతుంది. కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత రజని, సత్యరాజ్ ఇద్దరూ మాయమైపోతారు. శృతి హాసన్ తండ్రిని వెతికే క్రమంలో నాగార్జున చీకటి ప్రపంచాన్ని బయటికి తెస్తుంది. దీంతో ఆమెను చంపే ప్రయత్నాలు మొదలవుతాయి. అప్పుడే రీ ఎంట్రీ ఇస్తాడు రజని. అయితే వెతుకుతున్న తండ్రికి బదులు ఆయన ఫ్రెండ్ కనిపించడం శృతిని షాక్ కు గురి చేస్తుంది. ఇద్దరూ కలిసి వేట మొదలెడతారు. వినడానికి బాగానే ఉంది కానీ ఇదెంత వరకు నిజమో ఆగస్ట్ 14 తెలుస్తుంది.
టైం ట్రావెల్ అని ఒకరు, సై ఫై బ్యాక్ డ్రాపని ఇంకొకరు ఇలా కూలి ట్రైలర్ మీద రకరకాల డీ కోడింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ వాటిని కొట్టిపారేయడం లేదు. థియేటర్ లో చూశాక సర్ప్రైజ్ అవుతారని అంటున్నాడు. వార్ 2తో పాటు ఒకే రోజు రిలీజవుతున్న కూలి అంచనాలు అంతకంతా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్లతో మిలియన్ మార్క్ దాటేసిన రజనీకాంత్ అసలు డేట్ వచ్చెలోపు డబుల్ మిలియన్ లాక్ చేసేలా ఉన్నారు. రిలీజ్ కు ఇంకో ఎనిమిది రోజులే ఉన్న నేపథ్యంలో తలైవర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ అంతకంతా పెరిగిపోతోంది. భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధమయ్యింది.
This post was last modified on August 6, 2025 1:11 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…