Trends

5 కోట్లు మిగిలించడమంటే మాటలా

ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా అనుకున్న టైంలో, చెప్పిన క్వాలిటీతో సినిమా తీయడం, అది కూడా వాయిదాలు లేకుండా చూసుకోవడంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మంచి పేరుంది. కూలిలో నాలుగు బాషల నుంచి అతి పెద్ద మల్టీస్టారర్స్ ని సెట్ చేసుకుని కూడా చెప్పిన సమయానికి విడుదలకు సిద్ధం చేయడం మాములు విషయం కాదు. అనౌన్స్ మెంట్ వీడియో దగ్గరి నుంచి ట్రైలర్ దాకా అతను ఎంచుకున్న ప్రమోషనల్ స్ట్రాటజీ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే బడ్జెట్ విషయంలో తను ఎంత పొదుపరో ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున ద్వారా బయటికి వచ్చింది.

కూలీకి సంబంధించిన చివరి షెడ్యూల్ బ్యాంకాక్ లో తీస్తున్నారు. లాస్ట్ డే నాగార్జున దగ్గరికి వచ్చిన లోకేష్ షూటింగ్ అయిపోయిందని చెప్పాడు. దీని వల్ల నిర్మాత కళానిధి మారన్ కు 5 కోట్లు ఆదా అవుతాయని సంతోషంగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం నాగ్ వంతయ్యింది. నిజానికి ఒకవేళ ఇంకో 15 కోట్లు కావాలన్నా పెట్టేందుకు సన్ పిక్చర్స్ సిద్ధంగా ఉంది. అయినా సరే లోకేష్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ప్రొడ్యూసర్ కి మిగిలించడం మంచి విషయం. అదేమీ చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో మూడు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పబ్లిసిటీని ఒంటి చేత్తో పూర్తి చేయొచ్చు. అందుకే ఈ పొదుపు విలువైంది.

మన దగ్గర పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఇలా ఫాస్ట్ మేకింగ్ విత్ లిమిటెడ్ బడ్జెట్ సూత్రాన్ని పాటిస్తారు. కానీ ప్యాన్ ఇండియా ఉచ్చులో పడ్డ కొందరు డైరెక్టర్లు మాత్రం కాలయాపనతో పాటు నిర్మాతల పర్సులను బరువెక్కిస్తారు. కూలిని ఏడాదిలోపే పూర్తి చేసిన లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ ఇస్తాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. నటుడు సత్యరాజ్ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. వార్ 2 రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ మైలురాయి అందుతుందనే నమ్మకం రజని అభిమానుల్లో కనిపిస్తోంది. చూడాలి ఏం చేస్తారో.

This post was last modified on August 4, 2025 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

26 minutes ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

3 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

5 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

7 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

10 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

11 hours ago