వకీల్ సాబ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటారని భావించి పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ నవంబరులో తిరిగి మొదలు పెట్టాడు. అయితే సంక్రాంతికి సినిమా బిజినెస్ సాధారణ స్థితికి రాదనే దృఢ నమ్మకంతో దిల్ రాజు ఇప్పటికీ విడుదల ఖరారు చేయలేదు. సమ్మర్‍కి తొలి పెద్ద సినిమాగా దీనిని విడుదల చేయాలని దిల్ రాజు చూస్తున్నాడు. దీని వల్ల పవన్ కళ్యాణ్ ప్లాన్ దెబ్బ తింది.
ఎందుకంటే సంక్రాంతికి వకీల్ సాబ్ వస్తే ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ వేసవిలో రిలీజ్ చేసుకోవచ్చునని పవన్ భావించాడు. అందుకే ఆ సినిమాకోసం నలభై రోజుల కాల్షీట్లు ఇచ్చాడు. కానీ వకీల్ సాబ్ వెనక్కి వెళ్లడంతో అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ వేసవిలో విడుదల చేసే వీల్లేదు. కనీసం రెండు, మూడు నెలల వ్యవధిలో అయినా పవన్ స్థాయి హీరో సినిమాను విడుదల చేయడం మార్కెట్‍కి సమంజసం కాదు.
ఒకవేళ సమ్మర్‍లో వకీల్ సాబ్ వస్తే కనీసం ఆగస్ట్ లేదా దసరాకు అయ్యప్పనుమ్… రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి రావచ్చు. అదే జరిగితే ఇక క్రిష్ సినిమా వచ్చే ఏడాదిలో కాకుండా ఆ తర్వాతి ఏడాది వేసవికి వాయిదా పడవచ్చు. మరప్పుడు హరీష్ శంకర్ సినిమా ఎప్పటికి మొదలు కావాలి?
This post was last modified on November 19, 2020 5:10 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…