ట్రైలర్ టైంలో ది రాజా సాబ్ విడుదల డిసెంబర్ 5 ఉంటుందని నొక్కి చెప్పిన టీమ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. బయట జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరేలా జరుగుతున్న పరిణామాలు ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ ని పెంచేలా ఉన్నాయి. తాజాగా వదిలిన హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టినరోజు పోస్టర్ లో ఎక్కడా రిలీజ్ డేట్ ప్రస్తావన లేకపోవడం, ఎక్స్ లో పోస్ట్ చేసిన మెసేజ్ లో తేదీకి సంబంధించిన ట్యాగులు లేకపోవడం అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ది రాజా సాబ్ పండగను లక్ష్యంగా చేసుకుని వచ్చే ఏడాది జనవరి 9 రావడం దాదాపు పక్కా.
సంక్రాంతికి అయితే వసూళ్ల పరంగా డబుల్ మార్జిన్స్ చూడొచ్చనే బయ్యర్ల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉండటంతో పాటు, విఎఫెక్స్ క్వాలిటీని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఉద్దేశంలో ఇంకో నెల సమయం అదనంగా దొరికితే మంచిదేననే ఆలోచనతో కొత్త ఏడాదికి షిఫ్ట్ అయ్యారని వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడే చెప్పకపోవచ్చు. సెప్టెంబర్ 5 మిరాయ్ వచ్చి దాని సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక అప్పుడు రాజా సాబ్ అనౌన్స్ మెంట్ ఇవ్వొచ్చని అంటున్నారు.
ఇక జనవరి విషయానికి వస్తే జనవరి 9 విజయ్ జన నాయగన్ ఉంది. ఒకవేళ అదే డేట్ కి రాజా సాబ్ కనక క్లాష్ అయితే ప్రభాస్ మూవీకి తమిళనాడు, కేరళలో ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుంది. లేదూ ఒక రోజు ముందు వెనుకో వస్తే అడ్వాంటేజ్ మార్చుకోవచ్చు. విశ్వంభర కనక అక్టోబర్ లో వచ్చే పక్షంలో మెగా 157 వేసవికి వెళ్లిపోతుందనే ప్రచారం జోరుగా ఉంది. అది నిజమైతే ఒక కాంపిటీషన్ తగ్గుతుంది. రవితేజ -కిషోర్ తిరుమల మూవీ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సందర్భానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒకవేళ అఖండ 2 కనక సెప్టెంబర్ 25 నుంచి తప్పుకుంటే డిసెంబర్ 4 రావడం ఫిక్సవ్వొచ్చు.
This post was last modified on August 4, 2025 10:47 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…