Movie News

కొరటాల ఏం చేస్తున్నట్లు?


జూనియర్ ఎన్టీఆర్ చివరి చిత్రం ‘దేవర’ సినిమా రిలీజై పది నెలలు దాటిపోయింది. ఆ సినిమా తర్వాత అతను బాలీవుడ్ మూవీ ‘వార్-2’ పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నాడు. కానీ ‘దేవర’ తీసిన కొరటాల శివ పరిస్థితి ఏంటి అన్నదే అర్థం కావడం లేదు. ‘ఆచార్య’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఇబ్బంది పడకుండా పెద్ద బడ్జెట్లో ‘దేవర’ తీశాడు కొరటాల. కానీ ఈ సినిమాను సక్సెస్ చేసినా సరే.. తర్వాతి చిత్రాన్ని మాత్రం ఎంతకీ మొదలుపెట్టడం లేదు.

పోనీ ‘దేవర-2’నే ఆయన తర్వాతి ప్రాజెక్టా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. తారక్ ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యేలా లేడు. ‘డ్రాగన్’ పూర్తి చేయడానికి ఇంకో ఏడెనిమిది నెలలైనా పట్టొచ్చు. దాని తర్వాత అయినా ‘దేవర-2’ను మొదలుపెడతాడా అంటే సందేహంగానే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యస్వామి మీద సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మొదలుపెట్టడానికి ప్లాన్ వేసి పెట్టుకున్నారు. ఈ మధ్య ఒక ఈవెంట్లో ‘దేవర-2’ ఉంటుందని తారక్ చెప్పాడు కానీ.. ఆ సినిమాను మాత్రం వెంటనే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. కాబట్టి కొరటాల దాన్ని నమ్ముకుని వెయిట్ చేసే పరిస్థితి లేదు.
మరి ఆయన తర్వాతి సినిమా ఏది.. ఏ స్టార్‌తో సినిమా చేస్తాడు అంటే మాత్రం క్లారిటీ లేదు.

ప్రస్తుతం టాలీవుడ్లో ఏ టాప్ స్టార్ కూడా కొరటాలతో వెంటనే సినిమా చేసే స్థితిలో లేడు. అందరూ వాళ్ల వాళ్ల ప్రాజెక్టులతో ఫుల్ బిజీ. ఈ పరిస్థితుల్లో ఆయన చూపు అక్కినేని వారి మీద పడ్డట్లుగా ఓ రూమర్ వినిపిస్తోంది. మరి ఆ కుటుంబంలో ఎవరి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్నది ఆసక్తికరం. అఖిల్ అయితే ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల స్థాయికి తనతో సినిమా చేయడం సందేహమే. నాగార్జున, నాగచైతన్యల్లో ఒకరితోనే ఆయన సినిమా చేసే ఛాన్సుంది. ఎంతకీ తేలని తన వందో సినిమాను నాగ్.. చివరికి కొరటాల చేతుల్లో ఏమైనా పెడతాడా అన్నది క్వశ్చన్ మార్క్.

This post was last modified on August 3, 2025 10:20 am

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

24 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

30 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

47 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

52 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

3 hours ago