మహావతార నరసింహ.. పది రోజుల ముందు వరకు ఈ పేరుతో ఓ సినిమా రిలీజవుతున్నట్లే ప్రేక్షకులకు తెలియదు. కన్నడలో అశ్విన్ కుమార్ అనే దర్శకుడు యానిమేషన్లో రూపొందించిన చిత్రమిది. తెలుగులో కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న భక్తప్రహ్లాద కథనే యానిమేషన్లో తెరకెక్కించారు. పెద్దగా ప్రమోషన్ కూడా చేయకుండా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు మేకర్స్. కానీ తొలి రోజు చూసిన వాళ్లందరూ సినిమాను కొనియాడడం.. రివ్యూలు కూడా బాగుండడంతో సాయంత్రానికే లెక్కలు మారిపోయాయి.
టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం.. పిల్లలకు నచ్చే సినిమా కావడంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూడడం మొదలుపెట్టాయి. ఇక అక్కడ్నుంచి థియేటర్లు, షోలు పెరుగుతూ పోయాయి. దాంతో పాటే వసూళ్లు కూడా ఊహించని స్థాయిలో రావడం మొదలైంది. తొలి వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన సినిమా.. వీక్ డేస్‌లో కూడా బలంగానే నిలబడింది. కన్నడ, తెలుగు, హిందీ.. ఈ మూడు భాషల్లోనూ సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది.
రెండో వీకెండ్లోనూ ‘మహావతార నరసింహ’ అదరగొడుతోంది. శుక్రవారం ఈ చిత్రానికి ఇండియా వైడ్ రూ.7 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ఇక శనివారం అయితే కలెక్షన్లు ఇంకా పెరిగి రూ.10 కోట్ల మార్కుకు చేరువయ్యాయి. రిలీజ్ రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వచ్చిన వసూళ్లు రూ.2 కోట్లు మాత్రమే. కానీ పదో రోజు అంతకు ఐదు రెట్లు ఎక్కువగా కలెక్షన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.70 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రోజుతో పోలిస్తే రెండో వీకెండ్లో థియేటర్ల సంఖ్య నాలుగైదు రెట్లు అయింది. ఈ వీకెండ్లో ‘కింగ్డమ్’ లాంటి క్రేజీ మూవీ రిలీజైనా.. దానికి దీటుగా నిలుస్తోంది ‘మహావతార నరసింహ’.
హిందీలో అజయ్ దేవగణ్ సినిమా ‘సన్నాఫ్ సర్దార్-2’ను మించి కలెక్షన్లు రాబడుతోంది. ఒక యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో సంచలనం రేపడం అద్భుతం అనే చెప్పాలి. సిన్సియర్‌గా ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలా దాన్ని తమ భుజాల మీద మోస్తారో చెప్పడానికి ఇది రుజువు.
This post was last modified on August 3, 2025 9:38 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…