టాలీవుడ్ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుల మీద ఆరేళ్ల కిందట నమోదైన కేసులో వారికి ఊరట లభించింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కోసం ధర్నా చేసినందుకు వారిపై నమోదైన కేసును కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా.. 2019 మార్చి 22న తమ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు తిరుపతిలో రోడ్డుపై ర్యాలీ చేయడం, బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ర్యాలీ, ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని.. ప్రజలకు ఇబ్బంది తలెత్తిందని మోహన్ బాబు, విష్ణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ వారిపై అభియోగాలు మోపారు. తర్వాత ఆ ఎన్నికల్లో మోహన్ బాబు, విష్ణు మద్దతుగా నిలిచిన వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు ముందుకు కదల్లేదు. ఐతే పెండింగ్‌లో ఉన్న ఆ కేసు ప్రభుత్వం మారాక మళ్లీ వేగం అందుకుంది. తమపై పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని.. ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా తమపై కేసు పెట్టినందున దీన్ని కొట్టి వేయాలని మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు.
ఐతే వీరి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో వీళ్లిద్దరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నాక సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2019 మార్చి 23న చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను కొట్టి వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్‌లను కలిపి చదివిన తర్వాత అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్థం కాలేదని.. వాళ్లిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కానీ, ప్రజలకు హాని తలపెట్టినట్లు కానీ ఆధారాలు చూపలేకపోయారని సుప్రీం కోర్టు పేర్కొంది.
This post was last modified on August 1, 2025 10:44 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…