గత కొన్నేళ్లలో సౌత్ ఇండియా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పాట అంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ జైలర్‌లోని హుకుం సాంగ్ అనే చెప్పాలి. ఈ పాట ఇలా రిలీజైందో లేదో.. అలా పెద్ద హిట్ అయిపోయింది. సోషల్ మీడియాను ఆ పాట ఒక ఊపు ఊపేసింది. ఇక థియేటర్లలోనూ రజినీ అభిమానులకు మామూలు హై ఇవ్వలేదు ఆ పాట. ఒక మాస్ సినిమాలో హీరో ఎలివేషన్ సాంగ్ అంటే ఇలా ఉండాలి అని దీన్ని అందరూ రెఫరెన్సుగా తీసుకున్నారు తర్వాతి రోజుల్లో.
ఈ పాటకు స్వయంగా రజినీ ఎంతో ఇంప్రెస్ అయి.. జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్లో తన మేనల్లుడే అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు ముద్దు కూడా పెట్టాడు. ఐతే దీన్ని మించిన పాటను అనిరుధ్ ఇవ్వలేడని రజినీ అనుకున్నాడట. అదే మాట అనిరుధ్‌తో కూడా చెప్పాడట. కానీ కూలీ కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన పవర్ హౌస్ పాట విన్నాక రజినీ తన అభిప్రాయం మార్చుకున్నాడట. ఈ సాంగ్.. హుకుం పాటను మించిపోయిందని రజినీ కితాబు ఇచ్చినట్లు అనిరుధ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇక కూలీ సినిమా ఔట్ పుట్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. తాను ఈ చిత్రం గురించి హైప్ చేయనని అంటూనే బాగా హైప్ వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా మొత్తం చూశానని.. ఇందులో మాస్ మామెంట్స్ మామూలుగా ఉండవని చెప్పాడు. లోకేష్ కనకరాజ్ బెస్ట్ మాస్ మూవీగా దీన్ని పేర్కొన్నాడు అనిరుధ్. రజినీ మార్కు మాస్ ఉన్నప్పటికీ.. ఆయన లోకేష్ ప్రపంచంలోకి వచ్చి నటించాడని అనిరుధ్ చెప్పాడు.
ఇక తన వర్కింగ్ స్టైల్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. తాను రోజూ మధ్యాహ్నం నిద్ర లేస్తానని, తర్వాత తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతానని.. సాయంత్రం తన స్టూడియోలో అడుగు పెట్టి పాటల కంపోజింగ్ మొదలుపెడతానని అనిరుధ్ తెలిపాడు. తన టీంలో మొత్తం ఎనిమిది మంది ఉంటారని.. ఆ ఎనిమిది మందిలో ఒక్కరు పాట బాగా లేదన్నా దాన్ని పక్కన పడేసి తర్వాతి కంపోజిషన్ మీదికి వెళ్లిపోతామని అనిరుధ్ తెలిపాడు.
This post was last modified on August 1, 2025 7:55 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…