Movie News

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలకు సేతుపతి సమాధానం

అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్‌కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు సదరు వ్యక్తులను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు. 

శేఖర్ కమ్ముల లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద కూడా శ్రీరెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శేఖర్ తీవ్రంగా స్పందించేసరికి తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతి మీద కూడా ఇలాగే రమ్య అనే మహిళ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తన స్నేహితురాలు సేతుపతి వల్ల ఇబ్బంది పడిందంటూ ఒక మహిళ సోషల్ మీడియా పోస్టు పెట్టి డెలీట్ చేయడం సంచలనం రేపింది.

కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ బాగా ఎక్కువగా ఉందని.. దీని వల్ల తన స్నేహితురాలు ఇబ్బంది పడిందని.. విజయ్ సేతుపతి ఆమెను ఇబ్బంది పెట్టాడని.. దీంతో తన ఫ్రెండు డిప్రెషన్‌కు గురైందని రమ్య అనే మహిళ పోస్ట్ పెట్టింది. ఐతే ఈ పోస్టు మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని ఆమె డెలీట్ చేసింది. ఈ నేపథ్యంలో సేతుపతి సైతం స్పందించాడు. తనను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వాళ్లంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారని.. తనేంటో తనకు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసని సేతుపతి వ్యాఖ్యానించాడు. 

ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనను బాధ పెట్టలేవని.. కానీ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం బాధ పడ్డారని అతను చెప్పాడు. ఆమె ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తోందని.. కొన్ని నిమిషాల పాటు తను హైలైట్ అవుతుందని.. తనను ఎంజాయ్ చేయనివ్వాలని వాళ్లందరికీ చెప్పానని సేతుపతి తెలిపాడు. తన మీద పోస్టు పెట్టిన మహిళ మీద సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా సేతుపతి వెల్లడించాడు. తన పోస్ట్ వివాదాస్పదమయ్యేసరికి.. ఏదో కోపంలోనే అలా పోస్ట్ చేశానని.. అదంత వైరల్ అవుతుందని అనుకోలేదని రమ్య తర్వాత మరో పోస్టులో వివరణ ఇచ్చింది.

This post was last modified on July 31, 2025 3:33 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

1 hour ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

2 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago