మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర ఆగస్ట్ 27 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు కొన్ని వారాల క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికి ఇది ఏప్రిల్ లో రావాల్సిన సినిమా. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఒకసారి కాంపిటీషన్, మరోసారి శ్రీలీల డేట్లు అందుబాటులో లేకపోవడం, ఇంకోసారి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కావడం ఇలా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటీవలే రవితేజ తండ్రి కాలం చేయడంతో మరోసారి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఊహించని విషాదం కావడంతో మాస్ రాజా సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. పైగా శ్రీలీల కాల్ షీట్లు లేవట.
చేతిలో చూస్తేనేమో నెల రోజులు కూడా టైం లేదు. ఈలోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి, రీ రికార్డింగ్, సెన్సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, ప్రమోషన్ వగైరా సవాలక్ష పనులన్నీ చూసుకోవాలి. ఇది తీవ్ర ఒత్తిడికి దారి తీస్తుంది. అసలే సితార బృందం కింగ్డమ్ హడావిడిలో ఉంది. ఓ వారం దాకా దాని వ్యవహారాలు కొనసాగుతాయి. అటుపై నాగవంశీ వార్ 2 తాలూకు డిస్ట్రిబ్యూషన్, థియేటర్ రిలీజ్ వ్యవహారాల మీద దృష్టిపెట్టాలి. పెద్ద మొత్తం కాబట్టి ఆషామాషీగా వేరొకరికి అప్పజెప్పలేరు. ఇంత టైట్ షెడ్యూల్ లో మాస్ జాతర మీద ఫోకస్ పెట్టడం సులభం కాదు. అందుకే ప్రెజర్ తీసుకోకూడదని అనుకుంటున్నారట.
అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం దసరాకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఓజి, అఖండ 2, కాంతార 2తో పండగ సీజన్ ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఉంది. ఎవరైనా తప్పుకుంటే అప్పుడో స్లాట్ తీసుకోవచ్చు. కానీ అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతమైతే ఆగస్ట్ 27 టార్గెట్ గానే మాస్ జాతర పనులు జరుగుతున్నాయి కానీ మాట మీద ఉండే సూచనలు తగ్గుతున్నాయి. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. ఇడియట్ స్టైల్ లో వచ్చిన ఒక పాట ఆల్రెడీ హిట్టయ్యింది.
This post was last modified on July 30, 2025 1:55 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…