కింగ్ సైజ్ స్వాగతానికి ‘కింగ్డమ్’ సిద్ధం

గత సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్ కు సాలిడ్ ఓపెనింగ్ దక్కనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండింగ్ లోకి వచ్చేసిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలుపెట్టబోతున్నారు. మెయిన్ సెంటర్స్ లో ఇప్పటికే హౌస్ ఫుల్స్ కాగా అదనపు స్క్రీన్లు జోడించే పనిలో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నా ఇండియా టాక్ పది గంటలకే వచ్చేస్తుంది కాబట్టి అది కనక పాజిటివ్ ఉంటే మధ్యాహ్నం నుంచే అనూహ్యమైన పికప్ చూడొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా

ఇంత బజ్ వచ్చేందుకు కింగ్డమ్ విపరీతంగా ప్రమోషన్లు చేయలేదు. ట్రైలర్ కట్ ద్వారా ఒక ఇంటెన్స్ డ్రామాని చూపిస్తున్నామన్న హామీ ఇవ్వడం, అనిరుధ్ రవిచందర్ పాటలను సరైన పబ్లిసిటీతో జనాలకు చేరువ చేయడం, తిరుపతి హైదరాబాద్ ఈవెంట్ల ద్వారా రెండు రాష్ట్రాల ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడం లాంటివి బజ్ పెరిగేందుకు దోహదపడ్డాయి. రెండు మూడు వాయిదాలు పడి కొంత ఆలస్యంగా వస్తున్నా సరే హైప్ విషయంలో కింగ్డమ్ సాలిడ్ గా ఉంటూ వస్తోంది. అన్నిటిని మించి మళ్ళీ రావా, జెర్సీ దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి బ్రాండ్ ఇప్పుడీ కింగ్డమ్ మీద మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగేలా చేసింది.

రేపీ సమయానికి కింగ్డమ్ తాలూకు రిపోర్టులు రివ్యూలు హోరెత్తిపోతాయి. హరిహర వీరమల్లు కోలుకునే సూచనలు పెద్దగా లేకపోవడం రౌడీ బాయ్ ఎలా వాడుకుంటాడో చూడాలి. లక్కీగా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం చాలా పెద్ద సానుకూలాంశం. పైగా ఆగస్ట్ 14 వరకు బాక్సాఫీస్ కు గ్యాప్ వస్తుంది. అప్పటిదాకా థియేటర్స్ ఫీడింగ్ కి కింగ్డమ్ ఒకటే శరణ్యం. సో పాజిటివ్ టాక్ కనక తెచ్చుకుంటే ఏకధాటిగా రెండు వారాలు వసూళ్లు రాబట్టొచ్చు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన కింగ్డమ్ లో సత్యదేవ్ హీరో అన్నయ్యగా ముఖ్య పాత్ర పోషించగా స్టోరీ బ్యాక్ డ్రాప్ శ్రీలంకలో జరుగుతుంది.