Movie News

అనిరుధ్ జోరుని ప్రీతమ్ తట్టుకోగలడా

ఆగస్ట్ 14 బాక్సాఫీస్ వద్ద పరస్పరం తలపడే వార్ 2, కూలి పోటీ గురించి ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా ప్రతి చోటా చర్చ జరుగుతూనే ఉంది. ఎవరిది పైచేయి అవుతుందనే దాని మీద ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశ్లేషణలు చేసుకుంటున్నారు. అందరూ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మ్యూజిక్ కి సంబంధించిన డిస్కషన్ అంతగా కనిపించలేదు. ఎందుకంటే కూలికి బక్కోడు (అనిరుధ్ ముద్దుపేరు) ఇచ్చిన పాటలు జనాలకు ఓ రేంజ్ లో ఎక్కేశాయి. మౌనికా మౌనికా, పవర్ హౌస్ ఒకదాన్ని మించి మరొకటి ఫాస్ట్ గా రీచైపోయాయి. ఇప్పుడు వార్ 2 వంతు వచ్చేస్తోంది.

ఎల్లుండి మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద షూట్ చేసిన అవాన్ జవాన్ ని ప్రీతం కంపోజ్ చేశాడు. ఇది ఫస్ట్ పాట కాబట్టి ఖచ్చితంగా పోలికలు వస్తాయి. నిజానికి ప్రీతమ్ ఇప్పటివాడు కాదు. సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు పని చేశాడు. ధూమ్, రేస్, భూల్ భులాయ్యా, బర్ఫీ, భజరంగి భాయ్ జాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఒక కంప్లీట్ ఆల్బమ్ చార్ట్ బస్టర్ ఇచ్చి కొన్నేళ్ళయింది. ఒకటి రెండు పాటలు మంచివి ఇవ్వడం తప్ప పదే పదే వినాలనిపించే స్థాయిలో ఈ మధ్య తన కంపోజింగ్స్ లేవు.

సో ఇప్పుడు వార్ 2 రూపంలో ఒక మెగా ఛాన్స్ దక్కింది. దీంతో కనక ప్రూవ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇష్టుడైపోతాడు. అందులోనూ కూలికి ధీటుగా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లిక్ అవ్వాలి. మాములుగా నార్త్ ఆడియన్స్ కి తన స్టైల్ అలవాటే కాబట్టి తొందరగా కనెక్ట్ అయిపోతారు కానీ మన ప్రేక్షకులకు అలా కుదరదు. ప్రీతమ్ ప్రత్యేకంగా తెలుగు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ ఇచ్చి ఉంటాడని అనుకోలేం కానీ ధూమ్ రేంజ్ లో బీజీఎమ్ ఇస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే అనిరుధ్ తాకిడిని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు.

This post was last modified on July 29, 2025 9:23 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

15 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

23 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

38 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

39 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago