ఈ మధ్య టాలీవుడ్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ పెరుగుతున్నాయి. తమిళంతో పోలిస్తే మన దగ్గర తక్కువే కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పేరు, ఆదాయం వచ్చే అవకాశం కావడంతో క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే అనిరుద్ రవిచందర్ చెన్నైలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా వేదికను మార్చి మరో డేట్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే నవంబర్ 8 హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ ఒక ఈవెంట్ చేయబోతున్నారు.
ఇంకేం మ్యూజిక్ లెజెండ్ ని దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటున్నారా. కాకపోతే పర్సులు కొంచెం ప్రియంగా మారిపోతాయి. ఎందుకంటే టికెట్ రేట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. గంటల తరబడి నిలుచుని చూడాలన్నా కనిష్టంగా 1800 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది గోల్డ్ క్లాస్. లేదు కొంచెం మెరుగ్గా కావాలంటే ప్లాటినం 4 వేలు, ఎంఐపి 13 వేలు జంట టికెట్ కు కట్టాలి. లేదూ సౌకర్యం ఎక్కువగా కావాలంటే ఇద్దరికీ కలిపి 24 వేలు సమర్పించుకుంటే ఫేజ్ 3లో దగ్గర నుంచి చూడొచ్చు. ఫ్యాన్ పిట్ అని మరో రెండు సెక్షన్లున్నాయి. వీటిలో ఐదున్నర వేలు, పది వేలు టికెట్ రేట్లు. ఇవి కూడా స్టాండింగ్ సెక్షన్లే.
మూడు నెలల తర్వాత జరిగే ఈవెంట్ కి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మన సీట్లు రిజర్వ్ అవుతాయి. ఏడేళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో రెహమాన్ కన్సర్ట్ చేసినప్పుడు, అంతకు ముందు ఇళయరాజా నిర్వహించినప్పుడు కూడా ఇంత భారీ రేట్లు లేవనేది సంగీత ప్రియుల కామెంట్. అయినా సరే ఇంత పెట్టి వెళ్ళేవాళ్ళు లేకపోలేదు. రోజా నుంచి ధగ్ లైఫ్ దాకా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ తో బ్లాక్ బస్టర్స్ కు ప్రాణం పోసిన రెహమాన్ నెక్స్ట్ రామ్ చరణ్ పెద్దికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నవంబర్ ఈవెంట్ లో దీన్నుంచి ఏదైనా సాంగ్ అభిమానుల కోసం ఎక్స్ క్లూజివ్ గా పాడతారేమో వేచి చూడాలి.
This post was last modified on July 29, 2025 6:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…