Movie News

హిర‌ణ్య క‌శ్య‌ప‌.. అట‌కెక్కిన‌ట్లేనా?

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న సినిమా పేరు. భారీ స్థాయిలో ఈ సినిమా తీయడానికి చాలా ఏళ్ల కింద‌టే స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. తన కెరీర్ క్లోజ్ అయిపోయిందనుకుంటున్న సమయంలో భారీ బడ్జెట్లో ‘రుద్రమదేవి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసిన గుణ.. ఆ తర్వాత అంతకుమించిన సాహసోపేతంగా ‘హిరణ్యకశ్యప’ సినిమా తీయాలనుకున్నాడు. రానా దగ్గుబాటిని హీరోగా అనుకుని సురేష్ బాబును నిర్మాణానికి ఒప్పించి ఈ ప్రాజెక్టును ఘనంగా అనౌన్స్ చేశాడు. 

కానీ ఏవో కారణాలతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపి ‘శాకుంతలం’ సినిమా తీశాడు గుణ. దీని తర్వాత కచ్చితంగా ‘హిరణ్యకశ్యప’ను పట్టాలెక్కిస్తాడనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు సొంతంగా ‘హిరణ్య కశ్యప’ తీయడానికి రెడీ అయిపోయారు. దీని గురించి గ‌త ఏడాది అధికారిక ప్రకటన కూడా వ‌చ్చింది. త్రివిక్రమ్ రైటర్ కాగా.. దర్శకుడెవరన్నది అప్పుడు ప్రకటించలేదు. ఐతే త‌ర్వాత ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. మ‌రి ఎప్పుడు హిర‌ణ్య‌క‌శ్య‌ప ప‌ట్టాలెక్కుతుందా అని చూస్తుంటే.. దానికి ఊహించ‌ని విధంగా బ్రేక్ ప‌డేలా ఉంది.

క‌న్న‌డ నుంచి తాజాగా మ‌హావ‌తార న‌ర‌సింహ అనే యానిమేష‌న్ మూవీ వ‌చ్చింది. ముందు ఈ సినిమాను అంద‌రూ లైట్ తీసుకున్నారు. కానీ ఈ సినిమా క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, హిందీలో అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా అడుగులు వేస్తోంది. రోజు రోజుకూ స్క్రీన్లు, షోలు పెరుగుతున్నాయి. వ‌సూళ్లు కూడా ఊహించ‌ని స్థాయిలో వ‌స్తున్నాయి. ఇది భ‌క్త ప్ర‌హ్లాద క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా. హిర‌ణ్య క‌శ్య‌పుడి పాత్ర ఇందులో ఎంతో కీల‌కం. 

యానిమేష‌న్లో ఆ పాత్ర‌ను చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకు ఇంత మంచి ఆద‌ర‌ణ ద‌క్కాక మ‌ళ్లీ ఆ పాత్ర మీద ఫుల్ లెంగ్త్ ఫీచ‌ర్ ఫిలిం తీయ‌డం అంటే ఇబ్బందే. యానిమేష‌న్ మూవీకి, రియ‌ల్ మూవీకి తేడా ఉన్నా స‌రే.. ఈ త‌రం ప్రేక్ష‌కులు చూసేసిన క‌థ‌, పాత్ర‌తో మ‌ళ్లీ పెద్ద బ‌డ్జెట్లో సినిమా తీసి దాన్ని వ‌ర్కవుట్ చేయ‌డం అంత తేలిక కాదు. పైగా ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా ఏవో ఇబ్బందులున్న‌ట్లున్నాయి. అందుకే ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది. కాబ‌ట్టి ఈ సినిమా నిజంగా ప‌ట్టాలెక్కుతుందా అన్న‌ది సందేహ‌మే.

This post was last modified on July 29, 2025 10:18 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

14 minutes ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

7 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

8 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

10 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

11 hours ago