టాలీవుడ్లో ముందుతరం నిర్మాతల్లో చాలామంది ప్రొడక్షన్ ఆపేశారు. సురేష్ బాబు లాంటి వాళ్లు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా యాక్టివ్‌గా ఉంటూ సినిమాలు తీస్తున్నదంటే అల్లు అరవింద్, అశ్వినీదత్ మాత్రమే. మధ్యలో దత్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కానీ.. సమయానికి కూతుళ్లు పగ్గాలు అందుకుని ఆయన్ని నిలబెట్టారు. ఐతే ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రొడక్షన్లో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సీనియర్ ప్రొడ్యూసర్ అంటే.. అల్లు అరవింద్ అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా వరకు సక్సెస్ ఫుల్‌గానే రన్ అవుతుంటాయి. అదే సమయంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాన్ని అందుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలతో ఆయన జాక్ పాట్ కొడుతుంటారు.
గత కొన్నేళ్లలో కాంతార, 2018 సహా పలు చిత్రాలను రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు గీతా సంస్థకు ‘మహావతార నరసింహ’ రూపంలో మరో జాక్‌పాట్ తగిలింది. కన్నడలో రూపొందిన యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ను తెలుగులో ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రానికి పోటీగా రిలీజ్ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు.
కానీ ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ తెచ్చుకుని సాయంత్రానికి మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. రెండో రోజు నుంచి స్క్రీన్ కౌంట్ పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం కూడా సినిమా స్ట్రాంగ్‌గా నిలబడే సంకేతాలు కనిపిస్తున్నాయి. తక్కువ రేటుకే తెలుగు హక్కులు తీసుకున్న గీతా సంస్థ ఈ చిత్రం ద్వారా భారీ లాభాలే ఆర్జించేలా కనిపిస్తోంది. రిలీజ్‌కు ముందు ఇలాంటి సినిమాల మీద ఒక అంచనాతో హక్కులు కొనడంలోనే అల్లు అరవింద్ అండ్ టీం తెలివి దాగి ఉంది. ఒక యానిమేషన్ మూవీ ఇలాంటి అద్భుతాలు చేస్తుందని ఊహించడం కష్టం. ఐతే ఇది తెలుగులో సక్సెస్ అవుతుందని అరవింద్ బృందం గెస్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ఇప్పుడు పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాలను అందుకుంటోంది.
This post was last modified on July 28, 2025 2:45 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…