హరిహర వీరమల్లు విషయంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది విఎఫ్ఎక్స్ మీద వచ్చిన కంప్లయింట్స్ దృష్టిలో ఉంచుకుని వాటిని సరిచేయడమే కాక సెకండాఫ్ నిడివిని కొంత భాగం తగ్గించడం. ఆదివారం షోల నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. అయితే మొదటి మూడు రోజులు వచ్చిన టాక్ ని ఇవి అమాంతం మార్చకపోవచ్చు కానీ కొంత సానుకూల ప్రభావం చూపించే ఛాన్స్ లేకపోలేదు. ముఖ్యంగా టికెట్ రేట్లకు దెబ్బకు దూరంగా ఉన్న సాధారణ ప్రేక్షకులకు కొంచెం కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యూనిట్ దీని మీదే ఆశలు పెట్టుకుంది.
మరో ముఖ్యమైన విషయం సోమవారం నుంచి ఏపీ తెలంగాణలో చాలా సెంటర్లలో టికెట్ రేట్లను సాధారణ స్థితికి తీసుకొస్తున్నారట. కొన్ని చోట్ల 50 నుంచి 100 రూపాయలు తగ్గించనుండగా, మరికొన్ని చోట్ల గతంలో ఉన్న రెగ్యులర్ ధరలే పెట్టబోతున్నారు. ఇది చాలా సానుకూలాంశం. గురువారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదలవుతున్న నేపథ్యంలో వీరమల్లుకి వీక్ డేస్ కీలకం కాబోతున్నాయి. డ్రాప్ మరీ తీవ్రంగా ఉంటే కష్టమవుతుంది కానీ పికప్ ఉంటే టెన్షన్ అక్కర్లేదు. ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే వీకెండ్స్ బాగానే అనిపిస్తున్నా అసలైన అగ్ని పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది.
అసలు ఊహించని షాక్ మహావతార్ నరసింహ రూపంలో ఎదురయ్యింది. యానిమేషన్ మూవీ కదాని తేలిగ్గా తీసుకున్న వాళ్లకు దీని బాక్సాఫీస్ కలెక్షన్లు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో సండే ఒక్క టికెట్ దొరకని సిచుయేషన్ నెలకొనడం చిన్న విషయం కాదు. 160 షోలు వేస్తే అన్నీ ఫుల్ కావడం గమనార్హం. ఫామిలీస్ దీనికి ప్రాధాన్యం ఇవ్వడం హరిహర వీరమల్లుకు ప్రతిబంధకంగా మారింది. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ మిక్స్డ్ రియాక్షన్ల వల్ల పవన్ కళ్యాణ్ మేజిక్ పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వీకెండ్ ఫిగర్స్ చూశాక ఫైనల్ రన్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ రావొచ్చు.
This post was last modified on July 27, 2025 8:51 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…