పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన సినిమాలు హిందీలోకి కూడా చాలానే డబ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులకు పవన్ పవరేంటో చూపించాయి. కానీ పవన్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను హిందీలో కూడా అనువాదం చేసి ఒకేసారి రిలీజ్ చేస్తే అక్కడి జనాలు అస్సలు పట్టించుకోలేదు. సినిమా బాగుందా లేదా అన్నది పక్కన పెడితే దానికి మినిమం ఓపెనింగ్స్ రాలేదు. డబ్బింగ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోయిందా సినిమా.
ఇలా హిందీలో టాలీవుడ్ స్టార్లు చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాలకు మాత్రమే పర్వాలేదనిపించే ఫలితం వచ్చింది. ఒకప్పుడైనా మన స్టార్లకు అంతో ఇంతో అక్కడ ఫాలోయింగ్ ఉండేది కానీ.. ఇప్పుడు మన చిత్రాలు అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. ‘బాహుబలి’ వల్ల ప్రభాస్‌కు అమితమైన క్రేజ్ రావడం వేరు. మిగతా హీరోలెవ్వరూ అతడి దరిదాపుల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.
ఇలాంటి తరుణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డెబ్యూకు రెడీ అయిపోతుండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. అతడి సినిమాలు హిందీలో అనువాదమై మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి ఉండొచ్చు. ఆమాటకొస్తే మన హీరోలందరి సినిమాలకూ అక్కడ వ్యూస్ భారీగానే వస్తున్నాయి. రామ్ సైతం కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతున్నాడు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారిపోవడంతో ఖాళీ సమయాల్లో సౌత్ మాస్ మసాలా సినిమాలపై ఓ లుక్కేసే మాస్ ఫ్యాన్స్ ఉత్తరాదిన కోట్లల్లో ఉన్నారు.
ఈ లాజిక్ ఆలోచించకుండా బెల్లంకొండ శ్రీనివాస్ సాహసానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి తెలుగులోనే శ్రీనివాస్ ఇంకా నిలదొక్కుకోలేదు. పెద్ద దర్శకులతో భారీ చిత్రాలు చేశాడు కానీ.. ఒక్క ‘రాక్షసుడు’ మినహా ఏదీ ‘హిట్’ అనిపించుకోలేదు. అప్పుడే బాలీవుడ్ కు రెడీ అయిపోవడం టూమచ్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
This post was last modified on November 18, 2020 7:09 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…