టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరైనా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయాలనేది సగటు మూవీ లవర్స్ కోరిక. ఆ మధ్య పలు సందర్భాల్లో ప్రభాస్, రామ్ చరణ్ లలో ఎవరో ఒకరితో సినిమా ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ ఆ సూచనలు దరిదాపుల్లో కాదు కదా ఎప్పటికీ జరిగేలా లేవు. లోకేష్ మాటలు అవే స్పష్టం చేస్తున్నాయి. కూలి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ క్రేజీ డైరెక్టర్ దీని తర్వాత ఖైదీ 2 చేయబోతున్న సంగతి తెలిసిందే. కార్తీతో ఇంకో ఎనిమిది నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అలోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ గ్యాంగ్ స్టర్ గా నటించబోవడం విశేషం. ఇదయ్యాక అమీర్ ఖాన్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హీరో మూవీకి రంగం సిద్ధమవుతోంది.
ఈ మూడు థియేటర్లలో చూసేనాటికి 2027 అయిపోతుంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మరోసారి రజనీకాంత్ తోనే చేతులు కలుపుతాడట. ఇప్పటికే ఒక లైన్ చెప్పానని, భవిష్యత్తులో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి సెట్స్ పైకి తీసుకెళ్తానని ఒక తమిళ ఇంటర్వ్యూలో రివీల్ చేయడంతో తన లైనప్ గురించి క్లారిటీ వచ్చేస్తోంది. సూర్య రోలెక్స్, కమల్ హాసన్ విక్రమ్ 2 లిస్టులో ఉన్నాయి. కాకపోతే ఇవి ఖచ్చితంగా ఉంటాయా లేదా అని చెప్పడం లేదు. ఒకవేళ విజయ్ కనక రాజకీయాల్లో రాణించలేక తిరిగి సినిమాల్లోకి వస్తే కనక మళ్ళీ మాస్టర్ కాంబోని రిపీట్ చేసేందుకు లోకేష్ కనగరాజ్ సిద్ధంగా ఉన్నాడు.
అన్నట్టు అమీర్ ఖాన్ చేయబోతున్న సినిమా తాను ఎప్పుడో పదేళ్ల క్రితం సూర్య కోసం ఇరుంబు కై అని అందరూ అనుకుంటున్నారని, కానీ ఈ గ్యాప్ లో దాంట్లో ఉన్న కొన్ని సీన్లు ఎపిసోడ్లు వేరే దాంట్లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా కొత్త వెర్షన్ రాసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చాడు. కోలీవుడ్ కు మొదటి వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్న దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ మీద తమిళ సినీ ప్రియులు, మీడియా చాలా నమ్మకంతో ఉన్నారు. అదే రోజు వార్ 2 పోటీ ఉండటం వల్ల ఆ నెంబర్ సాధ్యమవుతుందా అనే అనుమానాలు ట్రేడ్ లో లేకపోలేదు. పాజిటివ్ టాక్ వస్తే వస్తా మాత్రం జైలర్ కి డబుల్ రిజల్ట్ ఖాయమే.
This post was last modified on July 26, 2025 2:25 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…