హరిహర వీరమల్లు మత దాడులకు చెంపపెట్టు!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన దక్కించుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సచిన్ కేడ్కర్, బాబి డియోల్, సునీల్ వంటి ఎంతోమంది కీలక పాత్రల్లో నటించారు.

క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాను కేవలం యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కేవలం ఇది ఒక కమర్షియల్ సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే హరిహర వీరమల్లు ఆనాడు ధర్మంపై జరిగిన దాడి మాత్రమే కాదు, నేడు కొందరు నాయకులు చేస్తున్న, ప్రోత్సహిస్తున్న మత దాడులకు చెంపపెట్టుగా నిలుస్తోంది. ఎందుకంటే ఔరంగజేబు అప్పట్లో ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు.

వాటిని అప్పటి ప్రభుత్వాలు ఫిల్టర్ చేసి కేవలం మంచిని మాత్రమే పాఠ్యపుస్తకాల్లో పెట్టి పిల్లల ముందుకు తీసుకు వచ్చాయి. కానీ అప్పట్లో చేసిన అరాచకాలు, అన్యాయాలను హరిహర వీరమల్లు సినిమా ద్వారా మరోసారి ప్రపంచం ముందుకు తీసుకువచ్చినట్లు అయింది. ఔరంగజేబు అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఎదురు నిలిచిన వీరమల్లు కథ కేవలం ఆయన ఒక్కడిదే కాదు, సనాతన ధర్మ పరిరక్షణకై పోరాడి కనుమరుగైన ఎంతోమంది యోధుల కథ. అలా చరిత్ర శోధించలేకపోయిన ఎందరో వీరులలో ఒకడైన వీరమల్లు కథ ప్రేక్షకులను ఇన్స్పైర్ చేస్తున్న తీరు అమోఘం.

హరిలా ఒకపక్క హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ, హరుడిలా శత్రుసంహారం చేసిన హరిహర వీరమల్లు, ఆబాల గోపాలాన్ని కట్టిపడేసేలా చేస్తుందని అభిమానులు అంటున్నారు. ప్రీమియర్స్‌తో మంచి స్టార్ట్ కనబరిచిన హరిహర వీరమల్లు చివరకు ఎంత వసూలు చేస్తదో చూడాలి.