సున్నితంగా ఉండకండి – పవన్ కళ్యాణ్ పిలుపు

సోషల్ మీడియా ప్రపంచంలో అవతలి వ్యక్తుల మొహం ఎలా ఉంటుందో తెలియకపోయినా బురద చల్లుకోవడం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్యాన్ వార్ పేరుతో యువత దీని మీద వృథా చేసుకుంటున్న సమయం ఎంతో ఉంది. దీని గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు. హరిహర వీరమల్లు స్పిరిట్ వర్సెస్ స్వార్డ్ సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ అభిమానులు మరీ సున్నితంగా తయారయ్యారంటూ, నెగటివిటీ వస్తే తరిమేయండి తప్ప వాటికి లొంగవద్దంటూ పిలువు ఇచ్చారు. తనను తిడితే విపరీతంగా రియాక్ట్ అవ్వొద్దంటూ చెబుతూనే సరైన రీతిలో సమాధానం ఇవ్వాలనే సంకేతం ఇచ్చారు.

నిన్న రాత్రి ప్రీమియర్లు పూర్తి కావడం కావడం ఆలస్యం హరిహర వీరమల్లు మీద నెగటివ్ ప్రచారం కాస్త గట్టిగానే జరిగింది. సినిమాలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ మరీ డ్యామేజ్ చేసే స్థాయిలో అయితే లేవు. కానీ కొన్ని వర్గాలు పనిగట్టుకుని డిజాస్టర్ రేంజ్ లో ప్రచారం చేయడంతో పవన్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. ఇప్పుడే కాదు గేమ్ ఛేంజర్ టైంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి. ఉదయం రిలీజ్ పెట్టుకుని ముందు రోజు రాత్రే నెగటివిటీని ఈ స్థాయిలో వీరమల్లుకు తీసుకురావడం గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడటం, ఆయన ప్రత్యేకించి అడ్రెస్ చేయడం గమనార్షం.

అఫీషియల్ నెంబర్లు ఇంకా రాలేదు కానీ ఫస్ట్ డే చాలా చోట్ల రికార్డులు హరిహర వీరమల్లు పేరు మీద ఉండబోతున్నాయి. ఏ స్థాయి హిట్టనేది అంచనా వేయడం కరెక్ట్ కాదు కానీ ఇంకో రెండు మూడు రోజులు వేచి చూడాలి. నైజామ్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ రికార్డుల పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక సోషల్ మీడియా కామెంట్ల గురించి పవన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. దమ్ముంటే తిరిగి కొట్టమంటూ ఇచ్చిన పిలుపు ఫ్యాన్స్ లో కొత్త జోష్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన విషయాలు కాకుండా కొత్తవి పంచుకున్న పవన్ కళ్యాణ్ మంచి హుషారుగా కనిపించరు.