ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న కూలీ మీద అంతకంతా అంచనాలు ఎగబాకడమే కానీ తగ్గే సూచనలు కించిత్ కూడా కనిపించడం లేదు. టీజర్ లేకుండా కేవలం గ్లిమ్ప్స్ తోనే ఈ స్థాయి హైప్ సృష్టించడం ఒక్క దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మాత్రమే చెల్లింది. ఇక్కడ అనిరుధ్ రవిచందర్ పాత్రను తక్కువంచనా వేయడానికి లేదు. పాటలతో బజ్ తేవడంలో తన డ్యూటీకి వంద శాతం న్యాయం చేశాడు. ఇప్పటిదాకా మెయిన్ క్యాస్టింగ్ లుక్స్ ని వీడియో రూపంలో రిలీజ్ చేయని కూలి బృందం ట్రైలర్ తో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తాజాగా చెన్నై టాక్ ఒకటి ఆసక్తికరంగా మారింది.
కూలిలో కొంచెం జైలర్ తరహా ఫార్ములానే వాడబోతున్నట్టు సమాచారం. లైన్ పరంగా లోకేష్ మరీ కొత్తగా స్టోరీ ఏం రాసుకోలేదని వినికిడి. ఒకప్పుడు హార్బర్ ని తన చెప్పు చేతల్లో ఉంచుకుని బంగారం స్మగ్లింగ్ చేసిన ఒక డాన్ రిటైరయ్యాక తిరిగి అతని గతం వెంటాడుతుంది. ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తన గ్యాంగ్ పరిచయాలు బయటికి తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దేవా (రజని), సైమన్ (నాగార్జున) మధ్య జరిగిన యుద్ధంలో ఎవరెవరు వచ్చారు, ఎవరు బలయ్యారు, ఎవరు మిగిలారు లాంటి ప్రశ్నల చుట్టూ లోకేష్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడట.
జైలర్ లో తన వాళ్ళను కాపాడుకోవడం కోసం ఎలాగైతే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సహాయం తీసుకున్నాడో ఇప్పుడు కూలిలో కూడా అదే తరహా ట్రీట్ మెంట్ ఉంటుందని, కాకపోతే లోకేష్ మార్క్ తో ఊహించనంత కొత్తగా ఉంటుందని ఇన్ సైడ్ లీక్. చివరి పది నిముషాలు అమీర్ ఖాన్ ఎంట్రీ షాకింగ్ గా ఉంటుందని, రోలెక్స్ ని మించుతుందా లేదాని చెప్పలేం కానీ నార్త్ ఆడియన్స్ మాత్రం వెర్రెక్కిపోవడం ఖాయమని అంటున్నారు. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందా లేదా అనే దాని మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. టాక్ బాగుంటే అందుకోవడం ఈజీనే.
This post was last modified on July 23, 2025 1:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…