ఈ తరంలో తెలుగులో ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పటి నటులు అతడి నటనకు ముచ్చటపడిపోయి ఆకాశానికెత్తేయడం ఎన్నోసార్లు చూశాం. దక్షిణాదిన వేరే భాషలకు చెందిన సీనియర్లు సైతం తారక్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన సందర్భాలు బోలెడు. తమిళ సీనియర్ నటి ఖుష్బు ఎన్టీఆర్ పేరెత్తితే చాలు.. తెగ పొగిడేస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ నటి అర్చన సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయింది.
80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొని అప్పటి, ఇప్పటి ముచ్చట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.
‘మహానటి’ సినిమా తనకు చాలా నచ్చిందని, అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన.. అలాగే ‘జనతా గ్యారేజ్’ కూడా తనను మెప్పించిందని ఆమె వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్‌లో అతడి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పింది. మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని అర్చన అంది.
మోహన్ లాల్‌కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్‌ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. అర్చన సినిమాల నుంచి విరామం తీసుకున్నాక 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఆమె తారక్‌ను ఇలా పొగడ్డం అతడి అభిమానులకు అమితానందాన్నిచ్చేదే.
This post was last modified on November 18, 2020 1:36 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…