ఇటీవలే తండ్రి శివశక్తి దత్తాని కోల్పయిన విషాదం ఇంకా కళ్ళముందు ఉండగానే సంగీత దర్శకులు కీరవాణి సినిమాల పట్ల తన బాధ్యతని విస్మరించకుండా నిన్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఫ్యాన్స్ ని కదలించింది. ఏదో మొక్కుబడిగా అలా వచ్చి వెళ్ళిపోతే ఆయన గొప్పదనం ఏముంటుంది. రావడమే కాదు పవన్ కళ్యాణ్ సినిమా పేర్లతో రాసుకున్న ఒక పాటను స్టేజి మీద సింగర్స్ తో పాటు తాను పాడి వేడుకకు వచ్చిన ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్క్ ఇచ్చేశారు. ఇంతకు ముందు వచ్చిన లిరికల్ సాంగ్స్ కన్నా ఇదే గొప్పగా ఉందనే కామెంట్స్ ఆడిటోరియంలో ఓపెన్ గానే వినిపించాయి.
ముప్పై అయిదు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో కీరవాణి. స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో మొదలుపెట్టి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దాక ఎందరో లెజెండ్స్ కి, కొత్త తరం స్టార్స్ కి పని చేశారు కానీ పవన్ కళ్యాణ్ తో చేయలేని లోటు పాతికేళ్లుగా వెంటాడుతూనే ఉంది. ఎందుకో ఈ కాంబో కోసం చాలా మంది డైరెక్టర్లు ప్రయత్నించినా సాధ్యపడకపోవడం విచిత్రం. అన్నయ్య చిరంజీవి ఘరానా మొగుడు లాంటి ఆల్బమ్స్ ఇచ్చిన కీరవాణి తమ్ముడికి ఇవ్వలేకపోవడం కాకతాళీయంగా జరిగినా ఫైనల్ గా ఇప్పటికి తీరింది. అందుకే బాగా ఫోకస్ పెట్టి మరీ హరిహర వీరమల్లుకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఒక్క ఎపిసోడ్ కే పన్నెండు రోజుల పాటు మిక్సింగ్ జరిగిందంటే ఏ స్థాయిలో అవుట్ ఫుట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ నాటు నాటుకి ఆస్కార్ సాధించాక కీరవాణికి దక్కిన మరో విజువల్ గ్రాండియర్ ఈ వీరమల్లు. పాటల పరంగా మరీ ఎక్స్ ట్రాడినరి రెస్పాన్స్ రాలేదు కానీ తెరమీద చూశాక అభిప్రాయాలు మారిపోతాయనే టాక్ అంతర్గతంగా ఉంది. నెక్స్ట్ లిస్టులో విశ్వంభర ఉంది కనక ముందు పవన్ కో బ్లాక్ బస్టర్ ఇస్తే తర్వాత చిరు మూవీకి బెస్ట్ ఆల్బమ్ ఆశించవచ్చు. హరిహర వీరమల్లులో చాలా సీన్లు బీజీఎమ్ వల్లే ఎలివేట్ అయ్యాయని దర్శకుడు జ్యోతికృష్ణ నొక్కి చెబుతున్నారు. ఫ్యాన్స్ కోరుకునేది కూడా అదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates