Movie News

నేను చాలా మంది హీరోల కంటే తక్కువ, ఎందుకంటే… – పవన్

ఏ స్టార్ హీరో కూడా తాను మిగతా హీరోల కంటే తక్కువ అనుకోడు. ఒకవేళ అనుకున్నా బయటికి చెప్పడు. కానీ తాను అందరికీ భిన్నమని పవర్ పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పాడు. తన సినిమాల గురించి, తన స్టార్ ఇమేజ్ గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోని పవన్.. కొన్ని సందర్భాల్లో తనను తాను తక్కువ చేసుకునే మాట్లాడతాడు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రెస్ మీట్లో కూాడా ఆయన అదే తరహాలో మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల కంటే తన స్థాయి తక్కువ అని పవన్ వ్యాఖ్యానించడం విశేషం. తాను రాజకీయ నాయకుడిగా ఎక్కువ పాపులర్ కానీ.. సినిమా స్టార్‌గా అంత పెద్దవాడిని కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.

తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్లలో పాల్గొనడం తక్కువ అని.. ఐతే నిర్మాత ఏఎం రత్నం కష్టం చూసి ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్‌కు వచ్చానని పవన్ చెప్పారు. సినిమాలంటే తనకు అపారమైన గౌరవం, ఆసక్తి అని.. తన ప్రాణవాయువు సినిమానే అని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

‘‘నేను తిరిగి సినిమాలకు వెళ్లిపోయానని ప్రత్యర్థులు తిడుతున్నారు. కానీ సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. మాట్లాడను. ఐతే సినిమా అంటే నాకు అపారమైన గౌరవం, ఆసక్తి.. అది నాకు ప్రాణ వాయువు. స్టోరీ టెల్లింగ్ అనేది ప్రతి మనిషికీ చాలా అవసరం. ఆ అవకాశం సినిమా మనకు కల్పిస్తుంది. ఈ సినిమా తీయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఏఎం రత్నం ఈ సినిమాను ముందకు తీసుకెళ్లారు.

నాకు రాజకీయంగా పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాల పరంగా చూస్తే మాత్రం చాలా మంది హీరోలతో పోలిస్తే నేను చాలా తక్కువ. మిగతా వాళ్ల సినిమాలకు అయినంత బిజినెస్ నా సినిమాలకు అవ్వదు. వాళ్లకు వచ్చినంత రెవెన్యూ నాకు రాకపోవచ్చు. నేను సినిమాల్లో పోటీ మీద ఎప్పుడూ అంత దృష్టిపెట్టలేదు. నేను సొసైటీ, రాజకీయాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. రత్నం గారి లాంటి నిర్మాతకు ఇబ్బందులు రాకూడదని నేను ఈ రోజు ప్రెస్ మీట్‌కు వచ్చాను. ఆయనకు ఏ ఇబ్బంది ఎదురైనా ఎవరి మీదా కోపం రాదు. కోప్పడొచ్చు కదా అంటే.. మౌనంగా ఉంటారు. ఆ మౌనమే నన్ను ఈ రోజు సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చేలా చేసింది’’ అని పవన్ అన్నారు.

This post was last modified on July 21, 2025 6:10 pm

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

22 minutes ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

47 minutes ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

1 hour ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

2 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

7 hours ago