ఏపీ డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్ కున్న కమిట్ మెంట్ల వల్ల ప్రమోషన్లకు రాలేరని నిర్మాత ఏఎం రత్నం చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో తప్ప పవర్ స్టార్ ప్రత్యేకంగా వేరే పబ్లిసిటీలో భాగం పంచుకున్న దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. కెరీర్ మొదట్లో ఏమో కానీ రాజకీయ ప్రయాణం ప్రారంభించాక కేవలం నటించడం వరకే తనను తాను పరిమితం చేసుకున్నారు. ఆఖరికి రిజల్ట్ కూడా ఏమయ్యిందో పెద్దగా పట్టించుకునే వారు కాదనేది అందరికీ తెలిసిన విషయం. అయితే హరిహర వీరమల్లు విషయంలో ఈ సెంటిమెంట్ ని పవన్ బ్రేక్ చేయబోతున్నట్టు సమాచారం.
రేపు ఉదయం హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. ఎందుకంటె సాయంత్రం శిల్పకళా వేదికలో ఎలాగూ మాట్లాడతాడని తెలిసినా మీడియా అడిగే ప్రశ్నలకు ఒక చిన్న స్టేజి మీద ఇచ్చే ఆన్సర్లు డిఫరెంట్ గా ఉంటాయి. పైగా కొంత సరదాతనం కలిసి ఉంటుంది. ఎలాగూ కొందరు జర్నలిస్టులు పాలిటిక్స్, సినిమాలు రెండు అంశాలను టచ్ చేస్తారు. వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తిరకంగా మారింది. వీడియోలు ఎలాగూ వైరలవుతాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యే అవకాశాల గురించి ప్రచారం జరిగింది కానీ అలాంటిది ఏమి లేదని వీరమల్లు అఫీషియల్ హ్యాండిల్ కన్ఫమ్ చేసింది. ఒకరోజు ముందే పాసుల పంపిణి జరిగిపోయింది. సో యథావిధిగా ఈవెంట్ ఉంటుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఒకే రోజు రెండు డబుల్ ధమాకాలు అభిమానులను ఖుషి చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈవెంట్ కి వద్దే వందలాది ఫ్యాన్స్ మధ్య పవన్ ఏం మాట్లాడబోతున్నాడనే దాని మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొంది. చూడబోతే రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ఆన్ లైన్ మొత్తం వీరమల్లు నామస్మరణలో ఉండబోతోంది.
This post was last modified on July 20, 2025 8:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…