ఒక పెద్ద టయర్ 1 స్టార్ హీరోకు ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడమనేది ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయింది. బాహుబలి తర్వాత మళ్ళీ ఎవరు ఆ రిస్క్ చేయలేదు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో పాటు లేనిపోని టాక్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో అగ్ర నిర్మాతలు వీటికి భయపడుతున్న మాట వాస్తవం. రిలీజ్ రోజు తెల్లవారుఝామున వేసినా పర్లేదు కానీ వన్ డే బిఫోర్ అంటే నో అంటున్నారు. కానీ ఈ నెగటివ్ మిత్ ని పుష్ప 2 ది రూల్ బ్రేక్ చేసింది. డిసెంబర్ 5 విడుదల అయితే 4వ తేదీ రాత్రి ప్రీమియర్లు వేయడం ద్వారా భారీ ప్రయోజనం అందుకుంది. కాకపోతే భారీ టికెట్ రేట్లతో.
అంతకు ముందు ఆ తర్వాత ఎవరూ ఆ రిస్క్ చేయలేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు దీనికి సై అంటోంది. నిర్మాత ఏఎం రత్నం చెబుతున్న దాని ప్రకారం జూలై 23 రాత్రి 9 గంటల తర్వాత స్పెషల్ షోలు వెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుంది. ట్రేడ్ టాక్ ప్రకారం ఈ షోల ధర 600 నుంచి 1000 రూపాయల మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. జిఓ వచ్చాక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇంత రేట్ పెట్టలేమనుకుంటే రెగ్యులర్ గా ఇచ్చే హైక్ తో జూలై 24 నుంచి ప్రేక్షకులు థియేటర్లో చూడొచ్చు. ఇక్కడ రిస్క్ అడ్వాంటేజ్ రెండూ ఉన్నాయి.
కంటెంట్ బాగుంటే ఉదయంలోపే పాజిటిక్ టాక్ దావానలంలా సోషల్ మీడియాలో పాకిపోతుంది. ఏ కొంచెం అటుఇటుగా ఉన్నా దీన్ని అవకాశంగా తీసుకుని నెగటివ్ చేద్దామని చూసే యాంటీ ఫ్యాన్స్ ఎలాగూ కాచుకుని ఉంటారు. వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది కలగొచ్చు. యునానిమస్ గా ఉంటే ఎవరూ ఏం చేయలేరు కానీ ఒక్క అట పూర్తయితే ఎవరూ ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు జనసేన వర్గాలు కూడా భారీ ఎత్తున వీరమల్లుకు స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. సెలెబ్రేషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates