పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు రెండు నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ముందుగా ఈ నెల 24న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుండగా.. సెప్టెంబరు 25కు ‘ఓజీ’ ఫిక్స్ అయింది. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ అంటే అందరూ ‘ఓజీ’ అనే చెబుతారు. పవన్ అభిమానులు ఈ సినిమా పేరు చెబితే ఊగిపోతున్నారు. ట్రేడ్ వర్గాల్లో కూడా దానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్సీ రేట్లకు ఆ సినిమాను కొంటున్నారు. ‘వీరమల్లు’కు కూడా ఒకప్పుడు మంచి హైపే ఉండేది కానీ.. బాగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం, రిలీజ్ డేట్లు మారడం లాంటి కారణాలతో బజ్ తగ్గిందన్నది స్పష్టం.
ఇలా హైప్ పరంగా ఈ రెండు చిత్రాల మధ్య తేడా ఉండడం.. ‘ఓజీ’కే డిమాండ్ ఎక్కువ కనిపిస్తుండడం గురించి ఒక ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’ దర్శకుడు జ్యోతికృష్ణకు ప్రశ్న ఎదురైంది. దీనిపై అతను స్పందించాడు. ‘‘నాలుగైదేళ్ల క్రితం హరిహర వీరమల్లు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిలిం కావడంతో ఇది మొదలైనపుడు దీని గురించే జనం ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల మా సినిమా ఆలస్యమైంది. ఒక దశ దాటాక అప్‌డేట్లు కూడా రాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి తయారైంది. నాతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులూ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు.
అదే సమయంలో ‘ఓజీ’ మొదలైంది. ఆ సినిమా ప్రోమోలు అద్భుతంగా ఉన్నాయి. అదొక భిన్నమైన యాక్షన్ మూవీ. ముంబయి బ్యాక్‌డ్రాప్, గన్స్, గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో నడిచే సినిమా అది. దీంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు నెలల వ్యవధిలో రాబోతున్నాయి. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. ఈ రెండు సినిమాలూ బాగా ఆడతాయి’’ అని జ్యోతికృష్ణ చెప్పాడు.
ముందు ‘హరిహర వీరమల్లు’ను మొదలుపెట్టిన దర్శకుడు క్రిష్‌కు తాను అభిమానినని ఈ సందర్భంగా జ్యోతికృష్ణ తెలిపాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడంతో ఒక అగ్ర దర్శకుడిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని అనుకున్నాం. తాను వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవుతున్నానని.. దీనిని పూర్తి చేయమని ఆయన చెప్పారనే.. అందుకే తాను ఈ సినిమాలో భాగం అయ్యానని.. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని జ్యోతికృష్ణ తెలిపాడు.
This post was last modified on July 17, 2025 10:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…