సెప్టెంబర్ 25 తేదీ మీద టాలీవుడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఎంత పెద్ద చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఓజి, అఖండ 2 రెండూ ఒకే డేట్ కి క్లాష్ అవ్వడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు ఒకవైపు ఆనందం, ఇంకోవైపు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎవరికి వారు మేం తగ్గేదేలే అనే సంకేతాలు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. తాజాగా నిర్మాత డివివి దానయ్య తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఓజి సెప్టెంబర్ 25 రావడం ఖాయమని, దీంతో పాటు హరిహర వీరమల్లు సూపర్ హిట్టవ్వాలని కోరుకుంటూ స్వామివారి దర్శనానికి వచ్చానని చెప్పడంతో ఫ్యాన్స్ లో ఉన్న సందేహాలు తీరిపోయినట్టే. సో ఓజి పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి.
ఇక అఖండ 2 డిసెంబర్ కు వెళ్తుందనే ప్రచారాన్ని ఖండిస్తూ టీమ్ వర్గాలు నిన్న వివిధ రూపాల్లో సమాచారం ఇవ్వడం చూశాం. సెప్టెంబర్ 25 రిలీజ్ కు అనుగుణంగానే వర్క్ జరుగుతోందని, ఒక పాట మినహా మొత్తం పూర్తయ్యిందని చెప్పడం చూస్తే లేట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాకపోతే 14 రీల్స్ నిర్మాతలు మరోసారి ప్రకటన చేస్తే మబ్బులు తొలగిపోతాయని బాలకృష్ణ అభిమానులు భావిస్తున్నారు. హరిహర వీరమల్లు వచ్చిన రెండు నెలలకే ఓజి రావడం అనూహ్య పరిణామం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటిదాకా ఇంత తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు రాలేదు.
వీటి సంగతలా ఉంచితే ఓజికి సంబంధించిన థియేటర్ బిజినెస్ హాట్ కేక్ లా మారిపోయింది. అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ కోసం పోటీ పడుతున్నాయి. ఏరియాల వారిగా వస్తున్న డిమాండ్ చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. గత కొన్నేళ్లలో ఏ పవన్ సినిమాకు రానంత భీభత్సమైన ఓపెనింగ్స్ ఓజికి వస్తాయనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. అందులోనూ పవన్ చాలా గ్యాప్ తర్వాత ముంబై గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. వదలింది చిన్న టీజరే అయినా వందల కోట్ల విలువ చేసే హైప్ తీసుకొచ్చింది. యావరేజ్ ఉన్నా బ్లాక్ బస్టర్, అదిరిపోతే ఇండస్ట్రీ హిట్ అనే రీతిలో ఓజి ఫీవర్ సర్వత్రా నెలకొంది.
This post was last modified on July 17, 2025 11:25 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…