సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విరామంలో జక్కన్న బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన అడ్డంకి పట్ల సీరియస్ గా వర్క్ జరుగుతోందట.
అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. లేదంటే ఆర్ఆర్ఆర్ కు ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కనక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుంది. కాకపోతే ఆ వెర్షన్ కూడా స్ట్రెయిట్ గా షూట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ ఇబ్బంది కాదు కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న కంపెనీల స్థితిగతుల మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.
అందుకే ప్రస్తుతానికి ఈ అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి. షూటింగ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్ నర్ షిప్ కోసం సంప్రదింపులు జరిపినా రాజమౌళి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ ని కనక సెకండరీ బ్యానర్ గా మార్చి మెయిన్ హౌస్ గా హాలీవుడ్ కంపెనీని పెడితే వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు ఛాన్స్ పెరుగుతుంది. ఇదంతా ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి వచ్చే సంవత్సరం వేసవిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
This post was last modified on July 17, 2025 11:21 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…