Movie News

రాజా సాబ్ వెనక్కు తగ్గే ఛాన్సే లేదు

డిసెంబర్ 5 విడుదల కాబోతున్న ది రాజా సాబ్ డేట్ మారొచ్చనే ప్రచారం ఒక వర్గంలో మొదలు కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే పలు వాయిదాలకు లోనైన ఈ ప్యాన్ ఇండియా మూవీ చెప్పిన టైంకే రావాలని వాళ్ళ కోరిక. ఎవరు ఎలాంటి గాసిప్స్ మొదలుపెట్టినా రాజా సాబ్ రాకలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ సంక్రాంతి ఆప్షన్ ఏమైనా చూస్తున్నారేమో అనే సందేహం రావొచ్చు. కానీ ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే సోలో డేట్ వదిలేసి అనవసరంగా కాంపిటీషన్ లో దిగడం వల్ల ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లు ఎఫెక్టవుతాయి. ప్రభాస్ వస్తాడని అందరూ తప్పుకోలేరుగా.

ప్రాక్టికల్ గా చూస్తే డిసెంబర్ 5 బెస్ట్ డేట్. ఎందుకంటే అదే తేదీకి వచ్చిన పుష్ప 2 ది రూల్ రెండు వేల కోట్లకు దగ్గరగా వెళ్ళింది. పరిమిత మార్కెట్లతోనూ యానిమల్ డిసెంబర్ మొదటి వారంలో వచ్చి తొమ్మిది వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇవి సోలోగా రావడం ఎంత పెద్ద మేలయ్యిందో డిస్ట్రిబ్యూటర్లను నిద్రలో లేపి అడిగినా చెబుతారు. ది రాజా సాబ్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలని చూస్తోంది. ఎందుకంటే ఒకవేళ సంక్రాంతిని వెళదామనుకునా చిరంజీవి రావిపూడిల మెగా 157 బరిలోనే ఉంటుంది. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ లను దాటుకుని సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ ఎంత పెద్ద హిట్టు కొట్టాడో చూశాం.

రవితేజ కిషోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఆల్రెడీ అఫీషియల్ గా బరిలో ఉన్నాయి. అసలైనది మరొకటి ఉంది. విజయ్ జన నాయగన్ పొంగల్ కే వస్తుంది. రాజా సాబ్ కనక పండగ సీజన్ కోరుకుంటే తమిళనాడు, కేరళలో విజయ్ వల్ల ప్రభాస్ ఓపెనింగ్స్, థియేటర్ పంపకాలు ప్రభావితం చెందుతాయి. ఇది ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు. డిసెంబర్ 5 రణ్వీర్ సింగ్ దురంధర్ ఉన్నా ఇబ్బంది లేదు. ఆ కాంపిటీషన్ ని ఫేస్ చేయొచ్చు. ఎటొచ్చి సంక్రాంతి గురించి ఆలోచిస్తేనే అవసరం లేని రిస్క్ కనిపిస్తుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ నిశ్చింతగా డిసెంబర్ 5న రాజా సాబ్ కోసం ఎదురు చూడొచ్చు.

This post was last modified on July 16, 2025 11:23 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

1 hour ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

2 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

2 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

3 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago