నిన్నా మొన్నటిదాకా ప్రచారం జరిగినట్టు బాలీవుడ్ రామాయణ ఏదో 1500 కోట్లతో అయిపోవడం లేదట. రెండు భాగాలు కలిపి అక్షరాలా 4000 కోట్ల దాకా ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపుతోంది. యుఎస్ కరెన్సీలో చెప్పుకుంటే 500 మిలియన్ డాలర్లు అవుతుందని వివరించిన నమిత్, హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ విజువల్ వండర్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. తాను ఎవరి డబ్బులతోనో తీయడం లేదని, ఫైనాన్షియల్ గా తన సోర్సెస్ ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నెంబర్లు చెబుతున్నానని వివరణ ఇచ్చారు.
ఇప్పట్లో కాదు భవిష్యత్తులో చాలా కాలం పాటు ఎవరూ అందుకోలేనంత స్కేల్ లో రామాయణ ఉంటుందని చెప్పడం అంచనాలు పెంచేస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం కేటాయించుకున్న రామాయణ కోసం ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రైమ్ ఫోకస్ సంస్థ పని చేయడం, దానికి నమిత్ మల్హోత్రానే సిఈఓ కావడంతో మూవీ లవర్స్ నమ్మకం అంతకంతా పెరుగుతోంది. 2026 దీపావళికి మొదటి భాగాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాతి సంవత్సరం పార్ట్ 2 ని విడుదల చేయబోతున్న నమిత్ మల్హోత్రా, లైఫ్ టైం థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు.
ఇంత బడ్జెట్ పెడుతున్నందుకు తోటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి తన మీద కామెంట్లు వస్తాయని చెబుతున్న నమిత్ మల్హోత్రా వాటికి కంటెంట్ ద్వారానే సమాధానం ఇస్తామని చెబుతున్నారు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ రామాయణంని హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆదిపురుష్ ఋజువు చేసింది. ఒకవేళ గొప్పగా చెబితే జనాలు బ్రహ్మరథం ఎలా పడతారో టీవీ సీరియల్ రామాయణం నిరూపించింది. మరి మోడరన్ రామాయణ దర్శకుడు నితేశ్ తివారి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తారో చూడాలి. అందులోనూ ఇంత ఖరీదైన సినిమాను.
This post was last modified on July 14, 2025 10:21 pm
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…