మొన్న మార్చి నెలలో దిల్ రుబాతో పెద్ద షాక్ తిన్న యూత్ హీరో కిరణ్ అబ్బవరం అక్టోబర్ లో రానున్న కె ర్యాంప్ తో రూటు మార్చేశాడు. ఇవాళ విడుదలైన టీజర్ లో బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపించడంతో పాటు మ్యూట్ చేసిన బూతులతో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. కేరళలో జరిగే కాలేజీ బ్యాక్ డ్రాప్ తో జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ కుర్రకారు ఎంటర్ టైనర్ కు చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంయుక్తంగా నిర్మించిన కె ర్యాంప్ లో మురళీధర్ గౌడ్, నరేష్, పవిత్ర లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది.
నిజానికి కిరణ్ అబ్బవరం మీద మొన్నటి దాకా ఒక కంప్లయింట్ ఉండేది. కథ ఏదైనా సీరియస్ ఎక్స్ ప్రెషన్లతో ఎక్కువ కనిపిస్తాడని. దిల్ రుబాలో అర్జున్ రెడ్డి టచ్ ఉన్న మాస్ క్యారెక్టరైజేషన్ ఏదో ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. పైగా ఆడియన్స్ తనను అలా చూడాలని కోరుకోవడం లేదు. సో ఇప్పుడు పూర్తిగా శరీర భాష మార్చుకుని కామెడీ జోన్ లోకి వచ్చాడు. మలయాళ లవ్ స్టోరీస్ గురించి, జీవితం గురించి వెరైటీ స్లాంగ్ తో పలికిన సంభాషణలు కొత్తగా ఉన్నాయి. అలాని పూర్తిగా మాస్ ని వదిలేయలేదు. ఫైట్ మధ్యలో గ్లాసులో మందు పోసుకునే సన్నివేశంలో పెద్ద బిల్డప్ ఇచ్చారు. కాకపోతే ఎబ్బెట్టుగా లేదు.
బాక్సాఫీస్ తత్వం అర్థం చేసుకున్న కిరణ్ అబ్బవరంకు కె ర్యాంప్ మీద చాలా ఆశలున్నాయి. దీని తర్వాత చెన్నై లవ్ స్టోరీ మీద మంచి బజ్ ఏర్పడింది. ఒక హిట్టు మూడు ఫ్లాపులుగా సాగుతున్న కిరణ్ కు గత ఏడాది క రూపంలో దక్కిన బ్లాక్క్ బస్టర్ మంచి కిక్ ఇచ్చింది. అయితే అది త్వరగా నీరుగారిపోయే ఫ్లాప్ వస్తుందని బహుశా ఊహించి ఉండకపోవచ్చు. అందుకే ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానంటున్న కిరణ్ నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లె టీవీ అనే చిన్న సినిమా తీశాడు. తాను లేకుండా కొత్త వాళ్ళను పెట్టి డీసెంట్ బడ్జెట్ లో పూర్తి చేశాడు. కె ర్యాంప్ కన్నా ముందు ఇదే థియేటర్లలో రిలీజ్ కానుంది.
This post was last modified on July 14, 2025 4:51 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…