ప‌వ‌న్ వ‌చ్చే వ‌ర‌కు వెల‌వెలే

ఎప్పుడో ఒకసారి కాస్త బాక్సాఫీస్ క‌ళ‌క‌ళలాడ‌డం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వెల‌వెల‌బోవ‌డం.. ఈ ఏడాదంతా ఇదే వ‌ర‌స‌. మే తొలి రెండు వారాల్లో కొంచెం సంద‌డి క‌నిపించింది. త‌ర్వాత నెల రోజుల పాటు గ‌డ్డు ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మ‌ళ్లీ జూన్ మూడో వారంలో వ‌చ్చిన కుబేర సినిమాతో మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో జ‌నం క‌నిపించారు. ఆ సినిమా రెండు మూడు వారాల పాటు సంద‌డి చేసింది. క‌న్న‌ప్ప ఒక వీకెండ్ వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించింది. ఇక అంతే.. ఆ త‌ర్వాత క‌థ మ‌ళ్లీ మామూలే. 

గ‌త వారం వ‌చ్చిన త‌మ్ముడు సినిమా వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. 3 బీహెచ్‌కేకు టాక్ బాగున్నా.. అనువాద చిత్రం కావ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఆక్యుపెన్సీలు క‌నిపించ‌లేదు. ఇక ఈ వారం సంగ‌తి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓ భామ అయ్యో రామ‌, ద 100 సినిమాలు రిలీజైన‌ట్లు కూడా జ‌నాల‌కు తెలియ‌ని ప‌రిస్థితి. సుహాస్ సినిమాలంటే కంటెంట్ రిచ్ అనే అభిప్రాయాన్ని ఇటీవ‌లి త‌న చిత్రాలు మార్చేస్తున్నాయి. ఓ భామ అయ్యో రామ త‌న కెరీర్లో వీకెస్ట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు అస‌లే బ‌జ్ లేదు. పైగా బ్యాడ్ రివ్యూలు, టాక్‌తో తొలి రోజే థియేట‌ర్లు ఖాళీ అయిపోయాయి. మొగిలి రేకులు సీరియ‌ల్ ఫేమ్ ఆర్కే సాగ‌ర్ న‌టించిన‌ ద 100 సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల వైపు ఆక‌ర్షించ‌లేక‌పోయింది. ఆ సినిమా నామ‌మాత్రంగా రిలీజైంది. టాక్ ప‌ర్వాలేద‌నిపించినా.. థియేట‌ర్ల‌లో జ‌నం లేరు. 

వ‌చ్చే వారం మీద కూడా పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకునే ప‌రిస్థితి లేదు. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న‌యుడు కిరీటి డెబ్యూ మూవీ జూనియ‌ర్‌తో పాటు కేరాఫ్ కంచ‌ర‌పాలెం నిర్మాత ప్ర‌వీణ ప‌రుచూరి ద‌ర్శ‌కురాలిగా అరంగేట్రం చేస్తున్న కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు చిత్రాలు వ‌చ్చే వీకెండ్లో రిలీజ‌వుతున్నాయి. జూనియ‌ర్ మూవీకి ప‌బ్లిసిటీ ఒక రేంజిలో చేస్తున్నారు. కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు విష‌యం ఉన్న సినిమాలాగే క‌నిపిస్తోంది. కానీ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు ఉన్న మూడ్‌లో ఈ సినిమాల‌ను ప‌ట్టించుకుంటారా అన్న‌ది సందేహ‌మే. టాక్ చాలా బాగుంటే ప‌రిస్థితి మారొచ్చు.

ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల కొత్త సినిమా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసిన‌ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే చెప్పాలి. అది జులై 24న రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం ఈసారి మాత్రం మిస్ కాకూడ‌దు. ఓ పెద్ద సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో ఆ సినిమా అనుకున్న ప్ర‌కార‌మే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ‌డం ఖాయం.