Movie News

ల‌వ‌ర్ బాయ్.. ఇక రొమాంటిక్ సినిమాలు చేయ‌డ‌ట‌

2000 త‌ర్వాత సౌత్ ఇండియ‌న్ సినిమాల్లో ల‌వర్ బాయ్ అనే మాట ఎక్కువ‌గా వాడింది మాధ‌వ‌న్‌కే అంటే అతిశ‌యోక్తి కాదు. తొలి చిత్రం అలై పాయుదే (తెలుగులో స‌ఖి)తో అత‌ను అమ్మాయిల మ‌న‌సు దోచేశాడు. యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించిన అత‌ను ఆ త‌ర్వాత చాలా ల‌వ్ స్టోరీల్లో న‌టించాడు. అందులో చాలా వ‌ర‌కు విజ‌య‌వంతం అయ్యాయి. వ‌య‌సు పెరిగాక మాధ‌వన్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్లు చేస్తూ త‌న కెరీర్‌ను పొడిగించుకున్నాడు. ఈ మ‌ధ్య మాధ‌వ‌న్ నెగెటివ్ రోల్స్ కూడా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఐతే లేటు వ‌స‌యులోనూ ఆయ‌న తాజాగా ఆప్ జ‌సా కోయి అనే రొమాంటిక్ మూవీలో న‌టించాడు. ఇందులో త‌న కంటే వ‌య‌సులో చాలా చిన్న‌దైన ఫాతిమా స‌నా షేక్‌తో రొమాన్స్ చేశాడు. దీని మీద విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ముందు ఈ విమ‌ర్శ‌ల‌ను మాధ‌వ‌న్ తేలిగ్గానే తీసుకున్న‌ట్లు క‌నిపించాడు. కానీ ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న మారింది. ఇక‌పై రొమాంటిక్ సినిమాలు చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు మాధ‌వ‌న్.
ఆప్ జైసా కోయి సినిమా మొద‌లుపెట్టిన‌పుడు తాను ఇంకా రొమాంటిక్ సినిమాలు చేయ‌గ‌ల‌ను అనే భావ‌న‌లోనే ఉన్నాడ‌ట మాధ‌వ‌న్. అందుకే త‌న‌కు వ‌య‌సు పెరిగినా స‌రే ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడ‌ట‌.

కానీ ఇక‌పై మాత్రం తన వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు మాధ‌వ‌న్ తెలిపాడు. ఇక‌పై రొమాంటిక్ సినిమాల‌ను పూర్తిగా వ‌దిలేస్తానేమో అనిపిస్తోంద‌ని.. చివ‌రి చిత్రంగా ఆప్ జైసా కోయిలో న‌టించాన‌ని అనుకుంటున్న‌ట్లు మాధ‌వ‌న్ తెలిపాడు. ఏ పాత్ర చేసినా అందులో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే మాధ‌వ‌న్.. ఆప్ జైసా కోయిలోనూ క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్లే న‌టించాడు. ఫాతిమాతో ఆయ‌న కెమిస్ట్రీ బాగానే పండింద‌నే అభిప్రాయాలు వినిపించాయి. కానీ సోష‌ల్ మీడియా జ‌నాలు మాత్రం ఈ వ‌య‌సులో యంగ్ హీరోయిన్‌తో రొమాన్స్ ఏంటి అని కామెంట్లు చేశారు. అవి మాధ‌వ‌న్‌ను బాగానే హ‌ర్ట్ చేసినట్లున్నాయి. అందుకే ఇక‌పై రొమాంటిక్ సినిమాలు చేయొద్ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నాడు ఈ మాజీ ల‌వ‌ర్ బాయ్.

This post was last modified on July 12, 2025 7:11 pm

Share

Recent Posts

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 minutes ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

44 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

3 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

3 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

5 hours ago