చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మెగా 157 టైటిల్ నిన్న హఠాత్తుగా లీకైపోయింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ పేరు ప్రచారంలోకి వచ్చేసింది. ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజు దీన్ని రివీల్ చేస్తారనుకుంటే ఇంత త్వరగా బయటికి రావడం ఫ్యాన్స్ ఊహించలేదు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ లీక్ బయటికి వదిలినట్టు ఇన్ సైడ్ టాక్. పబ్లిక్ పల్స్ పసిగట్టడంలో అనిల్ రావిపూడిది అందెవేసిన చెయ్యి. గతంలో సంక్రాంతికి వస్తున్నాంకు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ముందు నెగటివ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ తర్వాత అందరూ ఇదే పర్ఫెక్ట్ టైటిలని ఫిక్సయ్యేలా కంటెంట్ తో మెప్పించాడు.
ఇప్పుడు వరస చూస్తుంటే ముందు మన శంకర వరప్రసాద్ పేరుకి ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూద్దామనే ఆలోచనతోనే అనిల్ రావిపూడి ఇలా చేసినట్టు అర్ధమవుతోంది. ప్రస్తుతానికి అభిమానుల్లో మిక్స్డ్ ఫీడ్ బ్యాక్ ఉంది. అది చిరంజీవి స్వంత పేరు అయినప్పటికీ ఇంత క్రేజీ మూవీకి మరింత స్పైసి టైటిల్ పెట్టాలని అడుగుతున్నారు. ఇందులో డ్రిల్ మాస్టర్ గా నటిస్తున్న చిరంజీవి పేరు శంకర వరప్రసాద్. ఇది ఆయన ఒరిజినల్ నేమ్. అందుకే రావిపూడి అలా ఫిక్స్ చేసుకున్నాడన్న మాట. పూర్తి నెగటివిటీ వస్తే అప్పుడేమైనా మారుద్దామనుకున్నారో ఏమో కానీ ఈ మ్యాటర్ తేలడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.
అంతర్గత సమాచారం ప్రకారం ముందు అనుకున్న టైటిల్ రఫ్ఫాడిద్దాం. కానీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఇలాంటి ఎంటర్ టైనర్ కి ఆ పేరు బాగుండదేమోనని అభిప్రాయం టీమ్ సభ్యుల్లో కలగడంతో నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. అయితే బాలకృష్ణకి భగవంత్ కేసరి అని పెట్టినప్పుడు వచ్చిన వైబ్రేషన్ చిరుని వరప్రసాద్ గారు అంటే కలగడం లేదు. మరి ఇదంతా అనిల్ రావిపూడి పరిగణనలోకి తీసుకుంటాడో లేక హీరోనే మెచ్చుకున్నారు, మిగిలిన అభిప్రాయాలు తనకు అనవసరం అంటాడో వేచి చూడాలి. 2026 సంక్రాంతికి సిద్ధమవుతున్న మెగా 157కి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on July 12, 2025 9:57 pm
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తెలంగాణ చిరంజీవి, ప్రభాస్ అభిమానులకు పెద్ద ఊరట దొరికింది. గతంలో టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదంటూ సింగల్ బెంచ్ ధర్మాసనం…
రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న రాజా సాబ్ మన దగ్గర సౌండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా…