టాలెంట్ పుష్కలంగా ఉన్న హీరో సుహాస్ ఈ మధ్య పూర్తిగా ట్రాక్ తప్పేస్తున్నాడు. నిన్న విడుదలైన ఓ భామా అయ్యో రామాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. ప్రమోషన్లంటూ కాసింత హడావిడి చేశారు కానీ వాటితో పని జరగలేదు. ఫలితంగా మొదటి రోజే వీక్ బుకింగ్స్ తో బోణీ చేసింది. సరే ఇలాంటి సినిమాలకు వెంటనే జనం పరిగెత్తుకు రారు కానీ టాక్ వస్తే క్రమంగా పికప్ అయిన సందర్భాలు గతంలో బోలెడున్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఓ భామా అయ్యో రామా టైటిల్ కు తగట్టు అయ్యో అనిపించేసింది. వెరైటీ పాయింట్ తీసుకున్న దర్శకుడు రామ్ గోదల దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో విఫలమయ్యాడు.
హీరోయిన్ మాళవిక మనోజ్ తప్ప ఇంకే ఆర్టిస్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయింది. మదర్ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించినా ఓవరాల్ గా దాని ప్రభావం సున్నానే. ఈ సినిమా సంగతి కాసేపు పక్కనపెడితే సుహాస్ సబ్జెక్టు సెలక్షన్ వరస ఫ్లాపులు ఇస్తోంది. గత వారం అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఉప్పు కప్పురంబులో కూడా ఇదే రుజువయ్యింది. సానుభూతి డిమాండ్ చేసే పాత్రలనే ఎక్కువగా ఒప్పుకుంటుండటంతో నటన, కంటెంట్ రెండింటి పరంగా సుహాస్ రొటీనవుతున్న ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.
సుహాస్ సోలో హీరోగా ఇంకా నిలదొక్కుకోలేదు. కెరీర్ లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్. ప్రసన్నవదనం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓకే అనిపించుకున్నా మేజిక్ చేయలేకపోయాయి. శ్రీ రంగనీతులు, గొర్రె పురాణం తదితర వాటి ఫలితం గురించి గుర్తుచేసుకోకపోతే బెటర్. తమిళంలో వెట్రిమారన్ నిర్మిస్తున్న మందాడిలో విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సుహాస్ ఇప్పుడు ఇంట గెలవాల్సిన అవసరం మళ్ళీ పడింది. నిర్మాణంలో ఉన్న కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్ లో ఏది దాన్ని నెరవేరుస్తుందో చూడాలి.వాటి రిలీజ్ డేట్లు ఇంకా లాక్ చేయలేదు.
This post was last modified on July 12, 2025 1:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…