టాలీవుడ్ లో సెప్టెంబర్ నెల మీద పెద్ద చర్చ జరుగుతోంది. 25న పవన్ కళ్యాణ్ ఓజి రావడం గురించి డివివి ఎంటర్ టైన్మెంట్స్ పదే పదే క్లారిటీ ఇస్తోంది. వాయిదా వార్తలు నమ్మోదంటూ ట్వీట్లు పెడుతోంది. ఇంకో వైపు దీనికన్నా ముందు ఆ డేట్ ని అఫీషియల్ గా లాక్ చేసుకున్న బాలకృష్ణ అఖండ 2 వెనక్కు తగ్గేదేలే అనే రీతిలో షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. బోయపాటి శీను రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా చిత్రీకరణ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్లాష్ వద్దని, మంచి రెవిన్యూని పంచుకోవాల్సి ఉంటుందని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు కానీ ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితులు లేవు.
ఇదిలా ఉండగా తాజాగా విశ్వంభర సెప్టెంబర్ 18 లేదా 25 రావొచ్చనే టాక్ మొదలవ్వడం మెగా ఫ్యాన్స్ ని అయోమయంలో ముంచెత్తుతోంది. ఈ మేరకు యువి వర్గాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కు న్యూస్ వెళ్లిపోయిందట. అనుష్క ఘాటీ తేదీ చెప్పకుండా విశ్వంభర గురించి సమాచారం ఇవ్వడం గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదంతా అధికారికంగా జరిగిన ప్రకటన కాకపోయినా ఇన్ సైడ్ టాక్స్ అయితే జోరుగా ఉన్నాయి. ఓజి రాదనే నమ్మకంతో చిరంజీవి సినిమాను సిద్ధం చేస్తున్నారా లేక వారం గ్యాప్ సరిపోతుంది, రెండు ఆడతాయనే ధీమాతో ఉన్నారో ప్రస్తుతానికి భేతాళ ప్రశ్నే.
ఈ మూడు ఒకేసారి తలపడవనేది వాస్తవం. ఎవరు వెనక్కు తగ్గుతారనేది కూడా సస్పెన్సే. ఎందుకంటే డిసెంబర్ 5 రాజా సాబ్ ఉంది. అదే రోజు రణ్వీర్ సింగ్ దురంధర్ దిగుతోంది. సో ఆ వారాన్ని వదిలేయాల్సిందే. మెగా 157 సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది కాబట్టి విశ్వంభర ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లో రాదు. ఒకవేళ ఓజి మనసు మార్చుకుంటే దానికి మంచి ఛాయస్ అవుతుంది. ఎటొచ్చి అఖండ 2నే పక్కాగా చెప్పిన తేదీ సెప్టెంబర్ 25కి కట్టుబడేలా కనిపిస్తోంది. కాకపోతే ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే చేతిలో ఉన్నది కేవలం డెబ్భై నాలుగు రోజులు. ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 11, 2025 2:17 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…