హిట్టు కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్న నాగచైతన్యకు తండేల్ రూపంలో సూపర్ సక్సెస్ దక్కడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. ఫిబ్రవరిలో రిలీజైన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ చైతుకు మొదటి వంద కోట్ల గ్రాసర్ గా నిలిచి మార్కెట్ ని నిలబెట్టింది. మరీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో కాకపోయినా డ్రైగా అనిపించే ఫిబ్రవరిలో అంత విజయం సాధించడం విశేషమే. అయితే అసలు ట్విస్టు ఇది కాదు. తండేల్ హోమ్ ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అయ్యిందని చెప్పడానికి శాటిలైట్ టిఆర్పి రేటింగ్ నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ఇంత రెస్పాన్స్ బహుశా ఫ్యాన్స్ ఊహించి ఉండరు.
టీవీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తండేల్ టెలివిజన్ ప్రీమియర్ 10.32 రేటింగ్ తెచ్చుకుంది. ఈ సంవత్సరం ఇలా డబుల్ డిజిటల్ తెచ్చుకున్న సినిమాలు రెండే. సంక్రాంతికి వస్తున్నాం 15.92 తో అగ్ర స్థానంలో ఉండగా పుష్ప 2 ది రూల్ 12.61 తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు తండేల్ మూడో స్థానం తీసుకుంది. వెంకటేష్, బన్నీ సినిమాలతో పోలిస్తే చైతు మూవీ థియేట్రికల్ గా భీభత్సంగా ఆడలేదు. కానీ చిన్నితెరపై మాత్రం వాటితో పోటీ పడే స్థాయిలో పెర్ఫార్మ్ చేసింది. సముద్రం బ్యాక్ డ్రాప్, చైతన్య సాయిపల్లవిల జంట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వెరసి రీచ్ ఎక్కువ వచ్చేందుకు దోహదపడ్డాయి.
ఒకపక్క శాటిలైట్ మార్కెట్ అంతకంతా పడిపోతోందని నిర్మాతలు టెన్షన్ పడుతున్న ట్రెండ్ లో తండేల్ కొచ్చిన నెంబర్లు ఉత్సాహాన్ని ఇచ్చేవే. కాకపోతే అన్ని సినిమాలకు ఇలాంటి ఫలితాలు ఆశించలేం. ఓటిటిలో నెల రోజులకే కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ కు వస్తున్న నేపథ్యంలో యాడ్స్ తో కూడిన ప్రసారాన్ని చూసేందుకు ఎక్కువ శాతం ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదు. అందుకే కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు సైతం టిఆర్పి కోసం ఎదురీదుతూ ఉంటాయి. కానీ తండేల్ రిజల్ట్ మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ రెండూ జీ ఛానల్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
This post was last modified on July 10, 2025 5:10 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…