సరిగ్గా పది సంవత్సరాల క్రితం 2015 ఇదే తేదీ జూలై 10 ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది బిగినింగ్ విడుదలయ్యింది. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ ఎప్పుడో మర్చిపోయిన పురాతన జానపద వీరుల ఫిక్షన్ కథతో, వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీయడం గురించి రిలీజ్ కు ముందు వరకు ఇండస్ట్రీలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ప్రకటన దశ నుంచి మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ లో ప్రభాస్ హీరోగా నటించడం భవిష్యత్తులో అతన్ని ప్యాన్ ఇండియా స్టార్ గా మారుస్తుందని ఎవరూ జోస్యం చెప్పలేదు. టాలీవుడ్ నే కాదు యావత్ సినీ పరిశ్రమనే ప్రభావితం చేసే ఒక చరిత్రకు బాహుబలి ది బిగినింగ్ శ్రీకారం చుట్టింది.
బాహుబలి లాంటి అద్భుతాన్ని తీయాలన్న ఆలోచన రాజమౌళికి అమర్ చిత్ర కథ, చందమామ పుస్తకాల ఔపాసన పట్టిన సమయంలోనే వచ్చింది. దాన్ని తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో పంచుకుంటే శివగామి, కట్టప్ప పాత్రలతో మొదలుపెట్టి రాముడి లక్షణాలున్న అమరేంద్ర బాహుబలిని సృష్టించారు. తండ్రి మరణానికి కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమనే పాత పాయింట్ ని తీసుకుని దాన్ని ఊహించని మలుపులు ముడిపెట్టి, వెన్నుపోటు బ్లాక్ ద్వారా కనివిని ఎరుగని ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో జక్కన్న సాధించిన విజయం నిరుపమానం. క్లాసు మాస్ తేడా లేకుండా బాహుబలి విస్ఫోటనానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
అప్పటిదాకా ఒక లెక్క బాహుబలి నుంచి ఒక లెక్కలా తెలుగు సినిమా గమనం మారిపోయింది. బాలీవుడ్ ఖాన్లు ఈర్ష్య పడేలా, తలలు పండిన సినీ పెద్దలు విభ్రాంతికి గురయ్యేలా దేశ దేశాల్లో బాహుబలి వందల కోట్లు వసూలు చేయడం సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించబడింది. అనుష్క, తమన్నా, సత్యరాజ్, కిచ్చ సుదీప్, అడివి శేష్, లాంటి ఎందరికో కెరీర్ లో గర్వకారణంగా చెప్పుకునే చిత్రరాజంగా మిగిలిపోయింది. 14 నంది అవార్డులు, జాతీయ పురస్కారం, లెక్కలేనన్ని ప్రైవేట్ అవార్డులు ఎన్నో బాహుబలిని అలంకరించాయి. బాహుబలి 2 ది కంక్లూజన్ కు ఒక గొప్ప దారిని వేసిచ్చాయి. దశాబ్దం దాటిన సందర్భంగా రెండు భాగాలను కలిపి బాహుబలి ఒకే పార్ట్ ని ఈ ఏడాది విడుదల చేయబోతున్నారు. మూవీ లవర్స్ దాని కోసమే ఎదురు చూస్తున్నారు.
This post was last modified on July 10, 2025 12:18 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…